kanuma Celebrations : సకల దేవతలకు మూలదేవతగా కొనియాడబడుతున్న గోమాతను పూజించడం ద్వారా సర్వ సౌఖ్యాలు కలుగుతాయని ప్రతీతి..హైందవ సంస్కృతి లో గోమాతకు ఎంతో ప్రత్యేకత ఉంది. పవిత్రమైన కనుమ పండగ రోజు గోమాతను దర్శించుకోవడం ద్వారా 33 కోట్ల మంది దేవతలను దర్శించుకునే భాగ్యము కలుగుతుందని అంటారు. అంతే కాకుండా వ్యవసాయంలో రైతులకు సహకరించిన పశువులను అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించటం ఈ పర్వదినం ప్రత్యేకత. వ్యవసాయంలో తమతో పాటు కష్టించే పశువులను పూజించటం కనుమ పండుగ విశిష్టతగానూ చెప్పుకుంటారు. అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలం అయిన కనుమ నాడు గోవుని పూజిస్తే పితృదేవలతో పాటు సకల దేవుళ్లను ఆరాధించినట్లు భావిస్తారు.
ఎన్టీఆర్ జిల్లా :కనుమ పండుగ సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం గోశాల వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో భ్రమరాంబ పాల్గొని గోమాతకు పూజలు నిర్వహించి, ఆహారం అందించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
పార్వతి పురం మన్యం జిల్లా : పాలకొండ కోటదుర్గ పాలకొండ కోటదుర్గ ఆలయంలో గోమాతకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ మాట్లాడుతూ అనాటి నుంచి గోమాతను పూజించే సంప్రదాయం హిందూ సమాజంలో వస్తుందని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు కనుమ పండగ వేళ ప్రముఖ ఆలయాలైన శ్రీ కోటదుర్గ అమ్మవారి ఆలయంలో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. సకలదేవతా స్వరూపమైన గోమాతను పూజించడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయని నానుడి. ఆమదాలవలస మండలం శ్రీనివాసాచార్యుల పేట గ్రామం దేవాంగుల వీధిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి.