ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుప్రీం తీర్పుకు వక్రభాష్యాలు పాడుతున్నారు: కనకమేడల రవీంద్రకుమార్‌ - రాజకీయ వార్తలు

Kanakamedala reacts to the Supreme Court verdict: అమరావతి పై కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వైకాపా నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని... సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. సుప్రీం కోర్టులో జరిగిన వాదనలపై ఆయన స్పందించారు.

Kanakamedala
కనకమేడల రవీంద్రకుమార్‌

By

Published : Nov 29, 2022, 1:48 PM IST

Updated : Nov 29, 2022, 2:17 PM IST


Kanakamedala reacts on Court verdict: అమరావతి పై కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వైకాపా నేతలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని.. సీనియర్‌ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. సుప్రీం కోర్టులో జరిగిన వాదనలపై ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సుప్రీం కోర్టులో కీలకమైన వాదనలు జరిగిన తరువాత.. రైతులు, ఏపీ ప్రభుత్వం ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించుకుంటున్నారని కనకమేడల అన్నారు. హైకోర్టు ప్రధాన ధర్మాసనం కర్నూలులో పెడతామని ప్రతిపాదించారని తెలపగా.. ఇప్పుడు ఆ ప్రతిపాదనే లేదని కే.కే వేణుగోపాల్‌ బదులిచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Kanakamedala

రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్పష్టంగా చెప్పిందన్నారు. పార్లమెంటు ఒక కేపిటల్‌ అని చెబితే అదే అనుసరించాలి. ఇష్టానుసారం రాజధానులను ఎంచుకోవడానికి వీల్లేదన్నారు. సుప్రీం తీర్పును పక్కదారి పట్టిస్తూ ఆ తీర్పుకు వక్రభాష్యాలు పాడుతున్నారని కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 29, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details