Jogi Ramesh Video Conference: ఉగాది రోజు ఐదు లక్షలమంది లబ్దిదారులు గృహ ప్రవేశాలు చేసుకునేందుకు.. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికార్లను ఆదేశించారు. విజయవాడలో గృహనిర్మాణ శాఖ పై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారుల తో పాటు వీడియో కాన్ఫరెన్సు ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పనిచేస్తున్న గృహనిర్మాణ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది తో మంత్రి మాట్లాడారు. ప్రతీ జిల్లాలోను లక్ష్యాలను నిర్దేశించుకొని నూటికి నూరు శాతం ఇళ్ళ నిర్మాణాలను పూర్తీ చేయాలని ఆదేశించారు. ఒకే రోజు ఐదు లక్షలు ఇళ్ళలో గృహ ప్రవేశాలు జరపడంద్వారా దేశంలోనే ఒక ప్రత్యేకతను సాధించాలని మంత్రి దిశా నిర్దేశం చేసారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఉగాదికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి జోగి రమేష్
Jogi Ramesh Video Conference: ఉగాది రోజున ఐదు లక్షల గృహ ప్రవేశాలు చేసుకునేందుకు.. ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. దీనికి సంబందించి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికార్లతో సమీక్ష నిర్వహించారు. ఒకేరోజు ఐదు లక్షల ఇళ్లలో గృహప్రేవేశాలు జరపడం ద్వారా దేశంలోనే ప్రత్యేకతను సాధించాలన్నారు. అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని.. మంత్రి హెచ్చరించారు.
ఉగాదికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి జోగి రమేష్