Pothina Mahesh Comments on YS Jagan : యువతను అంధకారంలోకి నెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో యువతకి ఉపాధి లేక జాబ్ క్యాలెండర్ లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. జనసేన ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించే బహిరంగ సభ పోస్టర్ను జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విడుదల చేశారు.
'యువత జనసేన వైపు చూస్తోంది.. 12న మా బలమేంటో చూపిస్తాం' - జనసేన
Pothina Mahesh Comments on YS Jagan : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ విమర్శల వర్షం కురిపించారు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యువత జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.

పోతిన మహేశ్
'యువశక్తి' పేరుతో నిర్వహించే ఈ సభకు పోస్టర్ను కార్యకర్తలతో కలిసి మహేశ్ విజయవాడలో విడుదల చేశారు. వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ఘనంగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యువత జనసేన వైపు చూస్తుందని.. జనసేన బలమేంటో 12వ తేదీన తెలుస్తుందన్నారు. యువత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.
ఇవీ చదవండి: