Potina Mahesh sensational comments: వైసీపీ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్.. ఉత్తర కుమారుడి ప్రగల్బాలను మానుకోవాలని హెచ్చరించారు. విజయవాడలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణ వీధికి ఎప్పుడు, ఏ టైంకి రమ్మంటావో చెప్పు అంటూ సవాల్‌ను విసిరారు. దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించి.. సమయం, తేదీ చెప్పాలని, ఆ టైంకి వచ్చి అక్కడే తేల్చుకుందామన్నారు.
'నా సవాల్‌ను స్వీకరించి సమయం, తేదీ చెప్పు.. అక్కడే తేల్చుకుందాం' - ఎన్టీఆర్ జిల్లా వైరల్ వార్తలు
Potina Mahesh sensational comments: వైసీపీ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి వ్యాఖ్యలు చేయాలన్నారు. ఉత్తర కుమారుడి ప్రగల్బాలను మానుకోవాలని హెచ్చరించారు.
అనంతరం మెగా కుటుంబాన్ని మోసం చేశావని కనుక్కునే చిరంజీవి మీ ఆహ్వానాన్ని తిరస్కరించారన్నారని గుర్తు చేశారు. మూడు సింహాల ఘటనలో మీ ఇంటి ముట్టడికి తాను వస్తే, పారిపోయి క్యాంప్ ఆఫీసులో దాక్కున్న విషయాన్ని మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. 'గడప గడపకి మన ప్రభుత్వం'లో కార్యక్రమంలో భాగంగా 200 మంది పోలీసులు, 100 మంది నాయకులు, కార్యకర్తలతో వచ్చిన వెల్లంపల్లిని పరిగెత్తిచ్చామన్నారు. ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసేటప్పుడు ఆలోచించి వ్యాఖ్యలు చేయాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోతిన మహేష్ ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి