ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాడులు, హత్యలు తప్ప.. దళితులకు జగన్ ఏం చేశారని మా భవిష్యత్తు అనుకోవాలి: జడ శ్రావణ్ - జడ శ్రావణ్ చంద్రబాబుతో

Jada Shravan Kumar: జగన్ ప్రభుత్వం జగనన్నకు చెప్పుకుందాం.. జగనన్నే భవిష్యత్ కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, జడ శ్రావణ్​కుమార్ అన్నారు. ఉదయం లేవగానే హత్యలు, మారణహోమాలు సృష్టించే నువ్వా మా భవిష్యత్ జగన్ అని విమర్శించారు. దళితులకు హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇస్తే సరిపోతుందా? వెనుకబడిన వర్గాలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని నిలదీశారు. 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజున గడప గడపకు దగా ప్రభుత్వం పేరుతో పుస్తకం ప్రతి దళిత గడపకు అందిస్తామన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 5, 2023, 4:01 PM IST

జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, జడ శ్రావణ్ కుమార్

Jai Bheem Bharat Party President Jada Sravan Kumar: నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేసిందని, జగనన్న మా భవిష్యత్ అని కార్యక్రమం ఏర్పాటు చేశారని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. జగన్ ప్రభుత్వం జగనన్నకు చెప్పుకుందాం... జగనన్నే భవిష్యత్ కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత మూడు సార్లుగా ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ లాంటి వాళ్లు ఇటువంటి కార్యక్రమాలు పెడితే తప్పులేదన్నారు. ఉదయం లేవగానే హత్యలు, మారణహోమాలు సృష్టించే నువ్వా మా భవిష్యత్ జగన్ అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు ఏమి మేలు చేశావని జడ శ్రావణ్ ప్రశ్నించారు. దళితులకు హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇస్తే సరిపోతుందా? వెనుకబడిన వర్గాలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా అని నిలదీశారు. ప్రభుత్వం చేసిందేమిటో ఆధారాలతో చూపిస్తానని జడ శ్రావణ్ వెల్లడించారు. దళితులపై దాడులకు విషయంలో సమాధానం చెప్పగలరా అని సీఎంను ప్రశ్నించారు.

ఇసుక కొరతతో అసంఘటిత రంగాలు పనులు లేక రోడ్డున పడ్డాయన్నారు. 2,46,000 కోట్ల రూపాయల అప్పును ఈరోజు 10,00,000 కోట్ల రూపాయల అప్పుగా చేశారని జడ శ్రావణ్ మండి పడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకొని.. ప్రజలపై అప్పుల కుంపటి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి 151 సీట్లు ఇచ్చినందుకు ప్రజలు కుమిలికుమిలి ఏడుస్తున్నారన్నారని జడ శ్రావణ్ వెల్లడించారు. విజ్ఞత కలిగిన ఎమ్మెల్యేలు జగన్ పార్టీ నుండి బయటకు రావాలని కోరారు.

దాడులకు, హత్యలకు గురైన డాక్టర్ సుధాకర్, కిరణ్, శిరో ముండనం వరప్రసాద్, రమ్య కుటుంబాన్ని పరమర్శించారా అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దళిత జాతిపై జరుగుతున్న ధమనకాండపై ఉద్యమిస్తామని పేర్కొన్నారు. అందుకోసమే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ స్మారకసభలో గడప గడపకు దగా ప్రభుత్వం పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు జడ శ్రావణ్ తెలిపారు. గడప గడపకు దగా ప్రభుత్వం పేరుతో పుస్తకం ప్రతి దళిత గడపకు అందిస్తామన్నారు. 1500 మంది దళిత బిడ్డలపై జరిగిన దాడులు ఆధారాలతో సహా దళిత బిడ్డలకు అందిస్తామన్నారు. ఈ పుస్తకమే దళిత వ్యతిరేక జగన్ ప్రభుత్వానికి రాజకీయ సమాధి కడుతుందన్నారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి తమ పార్టీ సిద్ధంగా ఉందని.. ప్రజలు తమను ఆదరించాలని జడ శ్రావణ్ ప్రజలను కోరారు.

జగన్ ప్రభుత్వం జగనన్నకు చెప్పుకుందాం... జగనన్నే భవిష్యత్ కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉంది. ఉదయం లేవగానే హత్యలు, మారణహోమాలు సృష్టించే నువ్వా మా భవిష్యత్ జగన్ అని ప్రశ్నించారు. ఎస్సి, ఎస్టీలకు ఏమి మేలు చేశావని జడ శ్రావణ్ ప్రశ్నించారు. దళితులకు హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఇస్తే సరిపోతుందా... దాడులకు, హత్యలకు గురైన డాక్టర్ సుధాకర్, కిరణ్, శిరో ముండనం వరప్రసాద్, రమ్య కుటుంబాన్ని సీఎం జగన్ పరమర్శించారా? ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రియల్ 14 అంబేద్కర్ జయంతి రోజున విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ స్మారకసభలో గడప గడపకు దగా ప్రభుత్వం పేరుతో పుస్తకాన్ని ఆవిష్కరిస్తాం. జడ శ్రావణ్ కుమార్ , జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details