ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్​ ఇళ్లలో ఐటీ సోదాలు - it raids at avinash house

IT raids at ycp leader devineni avinash house
IT raids at ycp leader devineni avinash house

By

Published : Dec 6, 2022, 8:48 AM IST

Updated : Dec 6, 2022, 1:38 PM IST

08:43 December 06

IT RAIDS AT YCP LEADERS HOUSES : విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. వైసీపీ నేత దేవినేని అవినాష్‌ ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవినాష్‌ ఇంట్లో ఉదయం 6.30గంటల నుంచి సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ భూమి వ్యవహారంలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని స్థిరాస్తి వ్యాపారి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. వంశీరామ్‌ బిల్డర్స్‌ యజమాని ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌, విజయవాడతో పాటు నెల్లూరులోనూ ఆ సంస్థకు చెందిన సీఈవో, డైరెక్టర్లు, పెట్టుబడిదారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో 20కిపైగా బృందాలు పాల్గొంటున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 6, 2022, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details