ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2022, 9:55 AM IST

ETV Bharat / state

అక్రమంగా 129 మంది ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్ధం..!

AP Teachers Transfers: ఉపాధ్యాయులను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు షెడ్యూల్​ కూడా ప్రకటించింది. అయితే రాజకీయ పలుకుబడితో పైరవీలతో దొడ్డిదారిన కొందరు ఉపాధ్యాయులను మాత్రం మార్చేందుకు ప్రయత్నిస్తోంది.

Etv Bharat
Etv Bharat

AP Teachers Transfers : ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. రాజకీయ పలుకుబడితో పైరవీకారులను దొడ్డిదారిన మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫర్సులతో కూడిన 129 మంది ఉపాధ్యాయుల జాబితాను ఇటీవల ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదించిన జాబితాను పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు పంపించింది. పైరవీ బదిలీలపై గతంలో ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కొంతకాలం బయటకు తీయకుండా పక్కనపెట్టారు. తాజాగా సాధారణ బదిలీలకు ముందు దీన్ని బయటకు తీస్తున్నారు.

జిల్లాలవారీగా వివరాలను ఆన్‌లైన్‌లో జిల్లా విద్యాధికారులకు పంపితే.. పేర్లు బయటకు వచ్చేస్తున్నాయనే ఉద్దేశంతో.. విజయవాడలో బుధవారం జరగనున్న సమావేశంలో ఈ జాబితాలను రహస్యంగా ఆర్​జేడీలు, డీఈవోలకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ బదిలీల కంటే ముందు పైరవీ బదిలీలు పూర్తి చేసి.. ఈ స్థానాలను ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేస్తారు. దీంతో సాధారణ ఉపాధ్యాయులకు ఈ స్థానాలు కనిపించవు. పైరవీ బదీలీల్లో హెచ్​ఆర్​ఏ ఎక్కువగా ఉండేవి, పట్టణాలకు సమీపంలోని పాఠశాలలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 2020లో సాధారణ బదిలీలు చేసినప్పుడు 15 వేల పోస్టులను బ్లాక్ చేశారు. ఇవన్నీ పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలోనివే. దీంతో చాలా మంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. సాధారణ బదిలీలకు ప్రభుత్వం మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details