Indian Film Makers Association Conduct Cine Awards : ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 30న సినీ అవార్డులు అందజేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ తెలిపారు. సినీ రంగంలోని 24 కళల్లో ఈ అవార్డులు ఇస్తామని వివరించారు. సినీ కార్మికుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అసోసియేషన్ పని చేస్తుందని వారు స్పష్టం చేశారు.
Cine Awards on September 30 in Vijayawada :ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఆదివారం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రరెడ్డి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు అంబటి మధుమోహన్ కృష్ణ పాల్లొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సినీ రంగానికి కేంద్ర బిందువైన విజయవాడలో అవార్డులు అందజేయడం చాలా అభినందనీయమని వారు తెలిపారు. తమ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం సినీ రంగంలో ఉన్న 24 కళల్లో పని చేసే కార్మికుల సంక్షేమమే ధ్యేయమని వెల్లడించారు. దీనికి సంబంధించి జ్యురి, న్యాయ నిర్ణీతల కమిటీ నియమించినట్లు తెలిపారు. సినీ రంగానికి సంబంధించిన వారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 30 న అవార్డులు అందచేయనున్నట్లు తెలిపారు.
69th National Film Awards : RRRకు అవార్డుల పంట.. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన
ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా షార్ట్ ఫిలిమ్స్, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, మ్యూజిక్ వీడియో, సబ్మిట్ చేయాలని కోరారు. ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ దాదాపు 24 రాష్ట్రాల్లో ఉందని అన్నారు. అతి పెద్ద సామూహిక సంస్థ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ అని రామచంద్రరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 30 వ తేదీన కూడా ఇదే ఫిల్మ్ ఫెస్టివల్ తమిళనాడు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఫిల్మ్ అసోసియేషన్ సభ్యులు, సినిమాకు సంబంధించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామచంద్ర రెడ్డి కోరారు.