Diwali Special Sweets in Vijayawada: దీపావళి వస్తుందంటే.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ అదో ఆనందాల కేళి. సాధారణంగా ఈ పండగంటే అందరికీ గుర్తుకు వచ్చేవి దీపాలతో అందంగా అలంకరించడం, బాణసంచా పేల్చడం, మిఠాయిలు పంచుకోవడం. అందుకే రాష్ట్రంలో బాణసంచా దుకాణాలతో పాటూ స్వీట్ షాపుల్లోనూ బాగా రద్దీ పెరిగింది. దుకాణదారులు సైతం వివిధ రకాల మిఠాయిలు తయారు చేస్తూ.. వారిని ఆకర్షిస్తున్నారు.
దీపావళి పండగతో రాష్ట్రంలోని మిఠాయి దుకాణాలు రద్దీగా మారాయి. బాణాసంచా దూకాణాలు మాత్రమే కాకుండా స్వీట్స్‌కు సైతం డిమాండ్ పెరిగింది. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా పండుగలకు దూరంగా ఉన్న రాష్ట్రంలోని ప్రజలు ఈ ఏడాది సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ మిఠాయిలు కొనుగోలు చేసి బంధువులకు ఇస్తున్నారు.
కొందరు దుకాణదారులు ప్రత్యేకంగా బంగారపు పూతతో తయారు చేసిన మిఠాయిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఒక దుకాణాదారుడు మొత్తం 150 రకాల ప్యాకింగ్‌లను తయారు చేశారు. పండగ ప్రత్యేకంగా స్వీట్స్‌తో తయారు చేసిన పూలబొకేలు, చాక్లెట్లతో తయారు చేసిన బార్బి బొమ్మలు కొనుగోలుదారుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పండగ రోజు మిఠాయిల్ని బంధువులకు పంచి లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించటం సంప్రదాయంగా వస్తోందని, ప్రజలు చెబుతున్నారు.
గతేడాది తో పోలిస్తే ఈయేడాది 20 శాతం విక్రయాలు పెరిగాయని దుకాణదారులు చెబుతున్నారు . పండుగకు స్వీట్స్ తయారుచేసేందుకు కలకత్తా నుంచి ప్రత్యేకంగా మిఠాయిలు తయారుచేసే వారిని తీసుకువస్తామని చెబుతున్నారు . నాణ్యతకు ప్రాధాన్యత నివ్వటంతోనే ..నగరంలో తయారు చేసే స్వీట్స్ మహారాష్ట్ర, హైదరాబాద్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తామని విజయవాడకు చెందిన వ్యాపారి చెబుతున్నారు. నాణ్యతో పాటు నగరవాసులకు అందుబాటులో ఉండే ధరలకు విక్రయిస్తున్నామన్నారు.
మిఠాయిలు పంచుకుందాం.. పండగ చేసుకుందాం ఇవీ చదవండి: