Telangana New Secretariat Inauguration on February 17th: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ పుట్టినరోజున.. ఆయన కొత్త సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఆధునిక హంగులతో సచివాలయంను నిర్మిస్తున్నారు. వాస్తు సహా అన్ని రకాలుగా పరిశీలించి 20 ఎకరాల మేర చతురస్రాకార స్థలాన్ని ఎంపిక చేసి అందులో కొత్త సచివాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, పెద్ద సమావేశ మందిరం తదితరాలు ఉంటాయి.
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ - New Secretariat in State Latest News
Telangana New Secretariat Inauguration on February 17th: ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజున.. తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం కానుంది. ఇందులో ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మంత్రివర్గ సమావేశ మందిరం తదితరాలు ఆరో అంతస్తులో ఉంటాయి.
ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. సర్వర్లు, స్టోర్ రూంలు, తదితర అవసరాలన్నింటినీ కింది అంతస్థులోనే ఏర్పాటు చేయనున్నారు. రెండో అంతస్తు నుంచి మంత్రుల కార్యాలాయాలు ఉంటాయి. విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు విడిగా పార్కింగ్ ఉంటుంది. అధికారులు, సిబ్బందికి కూడా వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సందర్శకుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి ఉంటుంది. ప్రార్థనా మందిరాలు, మిగతా కార్యాలయాలు అన్నీ సచివాలయం వెలుపలే ఉంటాయి. ప్రహరీ లోపల కేవలం సచివాలయ భవనం మాత్రమే ఉంటుంది.
ఇవీ చదవండి: