IMD issues Orange Alert in Coastal Andhra: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంకెన్ని రోజులు ఈ వర్షాలు కురవనున్నాయి..? ఏయే జిల్లాలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి..? అనే వివరాలకు సంబంధించి.. వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Two Days Rains: ఆ ప్రకటన ప్రకారం.. కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, యానాంకు.. ఐఎండీ (IMD) ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. కోస్తాంధ్రలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని వివరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతోపాటు రెండు రోజులుగా కురుస్తున్న కారణంగా పలు జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వాతావరణ శాఖ వెల్లడించింది.
Anantapur District Weather Update:అనంతపురం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలుకురిశాయి. తాడిపత్రి, పుట్లూరు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల కోసం ఇంతకాలం ఎదురుచూసిన రైతులకు ఇది ఉపశమనం కలిగించింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. పంటలకు సకాలంలో నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పంటలు నీట మునగడంతో.. నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. కొన్ని గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
Rain Alert in AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
Kurnool District Weather Update..కర్నూలులో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు.. రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేసినట్లు.. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 21న తిరిగి నిర్వహిస్తామని తెలిపారు.