Illegal Sand Mining With Fake Bills in Joint Krishna District:ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం అర్థరాత్రి సినీఫక్కీలో ఇసుక లారీని మంత్రి జోగిరమేష్ ఎస్కార్ట్ వాహనం వెంబడించి ఢీకొట్టడం కలకలం రేపింది. చెవిటికల్లు నుంచి ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ.. ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడ వెళ్తుండగా అక్కడే వేచి ఉన్న మంత్రి జోగి రమేశ్ అనుచరులు ఎస్కార్ట్ వాహనంతో ఐదు కిలోమీటర్లు వరకు వెంబడించారని లారీ డ్రైవర్ తెలిపారు. ఈ క్రమంలో ఎస్కార్ట్ వాహనం లారీని ఢీకొట్టడంతో లారీ డివైడర్ పైకి దూసుకెళ్లిందన్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీమంత్రి దేవినేని ఉమ ఆగి ప్రమాదం గురించి అడిగి తెలుసుకుంటుండగా మంత్రి అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత వేరే పోలీసులు వచ్చి లారీని తొలగించారు.
Sand Mafia in graveyard శ్మశానాన్ని వదలని ఇసుకాసురులు.. అస్తిపంజరాలు బయటపడటంతో భయాందోళనలో ప్రజలు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకున్నా..యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఇసుక తవ్వకాల్లో మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు, మంత్రి జోగి రమేశ్‌కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ఈ నేపథ్యంలోనే మంత్రి అనుచరులు ఏకంగా ఎస్కార్ట్ వాహనంలోనే వెంబడించి ఇసుక లారీని ఆపేందుకు ప్రయత్నించారని ఉమ విమర్శించారు. వాస్తవానికి చెవిటికల్లులో ఇసుక నిల్వ కేంద్రమే లేకున్నా జేపి పవర్ వెంచర్స్ పేరిట ఇసుక బిల్లు ఉందని ఆయన వెల్లడించారు. జేపి పవర్ వెంచర్స్ పేరుతో ఇసుక బిల్లు ఉంది. చెవిటికల్లు నిలువ కేంద్రం నుంచి విక్రయించినట్లు ఉంది. వాస్తవానికి చెవిటికల్లు నిలువ కేంద్రం లేదు. లారీలో దాదాపు 30 టన్నుల వరకు వరకు ఇసుక ఉంది.