Illegal soil mining in state: ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరు సమీపంలోని రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్టపడటం లేదు. గుట్టలను గుల్లచేసి మట్టి తరలించడంతో ఆగకుండా.. భూమిని చదును చేసి ఆక్రమించి.. మామిడి మొక్కలు నాటాడు.. స్థానిక వైసీపీ నేత. జాతీయ హరిత ట్రైబ్యూనల్ ఆదేశాలను తుంగలోతొక్కి.. అధికార పార్టీ నాయకులు ఇష్టారీతిన తవ్వకాలు చేస్తున్నారు. కొత్తూరు తాడేపల్లిలో పగలేకాకుండా.. రాత్రీ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత నెల 20న అక్రమ క్వారీ ప్రాంతాలను.. పరిశీలించిన సంయుక్త కమిటీ పూర్తిస్థాయిలో విచారణ చేయకుండా మమఅనిపించింది.కొన్నిప్రాంతాల్నిఅసలుపట్టించుకోలేదు. మరోవైపు గనుల శాఖ ఏడీ రవికాంత్ సమర్పించిన నివేదికలో కేవలం పట్టాభూముల్లో తవ్వకాలపై మాత్రమే ఉంది. ఈ విషయంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు మళ్లీ ఫిర్యాదులు వెళ్లాయి.
కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిశీలన..గత నెల 20న విజయవాడ సబ్‌కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలకు.. కొందరు అధికారులు హాజరే కాలేదు. కొత్తూరు తాడేపల్లి గ్రామాల పరిధిలో కొన్ని ప్రాంతాలను మాత్రమే పరిశీలన చేశారు. పోలవరం కాలువ గట్లు తవ్వేస్తున్నారనే.. ఆరోపణల జోలికెళ్లలేదు. పాతపాడు అటవీభూములు, పి నైనవరం ప్రాంతంలో తవ్వకాలు.. జి.కొండూరు మండలంలోని వెలగలేరు ప్రాంతం, గుట్ట తవ్వకాలు తదితర ప్రాంతాలను.. పరిశీలించ లేదు. వెలగలేరు సమీపంలో అటవీ భూములను ఆనుకొని.. 30 ఎకరాల పట్టాభూముల్లో తవ్వకాలు జరిగాయి. దీనికి ఆనుకొని ఉన్న రిజర్వు ఫారెస్టులో.. భూమిని చదును చేసి ఏకంగా మామిడి మొక్కలు నాటారు.