Sensational judgment of Andhra Pradesh High Court: సహజ సంరక్షకుడైన తండ్రి వద్ద పిల్లలు ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు దానిని అక్రమ నిర్బంధంగా పేర్కొనలేమని తెలియజేస్తూ.. తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేవేసింది. పిటిషనర్ (తల్లి) దాఖలు చేసిన పిటిషన్‌పై తాము ఇచ్చిన ప్రస్తుత ఉత్తర్వులకు ప్రభావితం కాకుండా, తగిన ఆదేశాలు ఇవ్వాలని కింది కోర్టుకు సూచించింది. వైద్యుడైన తన భర్త తమ పిల్లలను అక్రమ నిర్బంధంలో ఉంచారని, వారిని కోర్టులో హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ.. హైకోర్టులో వేసిన పిటిషన్‌పై జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖరావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళ.. వైద్యుడైన తన భర్త మరో మహిళతో జీవనం సాగిస్తున్నారని, తమ పిల్లలను అక్రమ నిర్బంధంలో ఉంచారని, వారిని కోర్టులో హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో వసతి గృహంలో ఉంటున్న తమ కుమార్తెను, ఏడేళ్ల కుమారుడిని తన భర్త బలవంతగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం.. ఆమె (పిటిషనర్) భర్త వద్దనున్న పిల్లలను కోర్టుకు తీసుకురావాలని.. కృష్ణా జిల్లా ఎస్పీ తరఫున పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ.. విచారణ వాయిదా వేసింది.
పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ‘హెబియస్’ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు.. పిల్లలతో స్వయంగా మాట్లాడారు. తండ్రి వద్ద తాము ఇష్టపూర్వకంగా ఉంటున్నామని పిల్లలు చెప్పడంతో.. తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సహజ సంరక్షకుడైన తండ్రి వద్ద పిల్లలు ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు దానిని అక్రమ నిర్బంధంగా పేర్కొనలేమని, అక్రమ నిర్బంధమే పరమావధి అని ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఆ పిల్లలను తన కస్టడీకి కావాలని తల్లి భావిస్తే.. సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై తాము (హైకోర్టు) ఇచ్చిన ప్రస్తుత ఉత్తర్వులకు ప్రభావితం కాకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కింది కోర్టుకు సూచించింది.
అసలు ఏం జరిగిందంటే.. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళకు వైద్యుడైన భానుమూర్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలో వారికి ఓ కుమార్తె, కుమారుడు జన్మించారు. తనభర్త మరో మహిళతో జీవనం సాగిస్తున్నారని.. పిల్లలకు అక్కడ ఉంటే ప్రమాదమని.. ఓ వసతి గృహంలో ఉంచారు. ఆ తర్వాత తన భర్త పిల్లలను బలవంతగా తీసుకెళ్లి.. అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ.. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు.. కృష్ణా జిల్లా ఎస్పీ తరఫున పోలీసులు పిల్లలను కోర్టుకు తీసుకొచ్చారు. వారితో న్యాయమూర్తులు వ్యక్తిగతంగా మాట్లాడగా.. తండ్రి తమను నిర్బంధంలో ఉంచలేదని, ఆయనతోనే (తండ్రి) ఉండాలని తమకు ఇష్టంగా ఉందని, ఆయనతో తమకేమీ అపాయం లేదని పిల్లలు చెప్పారు.