How to Download Digital Voter ID Card With Photo: ఓటు హక్కు వజ్రాయుధం వంటిది. దేశ భవిష్యత్‌ని మార్చే పాలకులను ఎన్నుకునే విషయంలో చాలా ముఖ్యమైంది. అందుకే 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా తప్పక నమోదు చేసుకోవాలి. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పాలక పార్టీ భారీ సంఖ్యలో కొత్త ఓటర్లను నమోదు చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటర్లను తొలగిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Download Digital Voter ID Card with Photo: ఓటర్ ఐడీ కార్డు అంటే చాలా మందికి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకే చేతిలో ఉంచుకుని తర్వాత భద్రంగా దాచిపెడతారు. కానీ ఓటర్ ఐడీ కార్డు ఎన్నికలప్పుడు మాత్రమే కాక ఇతర సందర్భాల్లోను ఉపయోగపడుతుంది. ఈ కార్డును ప్రతీ సారి మన వెంట తీసుకెళ్ల లేము. ఒక్కోసారి పొరపాటున మర్చిపోతుంటాం. అలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం స్మార్ట్ ఫోన్లోనే ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డుని డౌన్‌లోడ్ చేసుకోనే అవకాశం కల్పించింది.
e-EPIC card: రెండేళ్ల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఈ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు(e-EPIC card)ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆధార్, పాన్ కార్డు మాదిరిగానే డిజిటల్ ఓటర్ కార్డు కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ కార్డును ఎన్నికల సమయంలో చూపించి ఓటు వేయవచ్చు. ఈ కార్డుని పీడీఎఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.