House Rent Scam: ఈ మధ్యకాలంలో ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఎక్కువ మంది వివిధ మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ వేదికలైన 99ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్స్, క్వికర్, ఓఎల్‌ఎక్స్, తదితర వాటిల్లో ప్రకటనలు పోస్ట్ చేస్తున్నారు. దీని వల్ల స్పందన భారీగా ఉంటుందని అభిప్రాయపడుతూ.. కేటుగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణలంకకు చెందిన ఓ మహిళ.. తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు.. ఓ సైట్లో ప్రకటన ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. అది గమనించిన ఓ వ్యక్తి కాల్ చేసి ఆమె ఇంట్లో.. తమ కుటుంబంతో సహా అద్దెకు దిగుతామని చెప్పాడు. అడ్వాన్స్‌గా రూ.40వేలను యూపీఐ యాప్ ద్వారా పంపుతున్నానని చెప్పి.. క్యూఆర్ కోడ్ పంపాడు. దానిని స్కాన్ చేయమని ఆమెతో చెప్పాడు. అతడు చెప్పిన మాటలను నిజమేనని నమ్మిన ఆమె.. తన ఫోన్‌కు వచ్చిన ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశారు. అంతే ఆమె ఖాతా నుంచి నగదు మాయం అయిపోయింది.
How to Use UPI Lite : మీరు 'యూపీఐ పిన్' ఎంటర్ చేయకుండానే.. డబ్బులు చెల్లించవచ్చు.!
మరోవైపు నగరంలోని అయోధ్యనగర్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఆయనకు కాల్ చేసి.. ఆ ఇంట్లో అద్దెకు దిగుతానని చెప్పాడు. తాను ఆర్మీలో పని చేస్తున్నానని, బదిలీపై విజయవాడకు వస్తున్నానని నమ్మబలికాడు. ఇంటికి సంబంధించిన ఫొటోలను పంపించమన్నాడు. ఫొటోలను వాట్సాప్ చేయటంతో.. ఆ ఇల్లు తనకు నచ్చిందని, బ్యాంక్ వివరాలను పంపిస్తే అడ్వాన్స్ నగదును పంపిస్తానని చెప్పాడు.
అయితే బ్యాంక్ వివరాలను పంపించేందుకు విజయవాడకు చెందిన వ్యక్తి నిరాకరించారు. దీంతో మరుసటి రోజు మళ్లీ ఆయనకు కాల్ చేసి.. తాను అకౌంట్స్ విభాగంలో ఉన్నానని, వివరాలను కార్యాలయంలోని సిబ్బందికి అందజేయాలని చెప్పాడు. క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌కు పంపించి స్కాన్ చేయమని చెప్పాడు. దీంతో అతడి మాటలు నిజమేనని నమ్ని స్కాన్ చేయటంతో.. ఖాతా నుంచి రూ.4.34 లక్షలు డెబిట్ అయినట్లు మొబైల్‌కు వచ్చిన ఎస్ఎంఎస్ చూసి నిర్ఘాంతపోయారు.
నగరానికి చెందిన వ్యక్తి తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఓ యాప్‌లో ప్రకటన పోస్ట్ చేశారు. ఇది చూసి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. రెండు నెలల అద్దె నగదును గూగుల్ పే ద్వారా రూ.65 వేలు పంపుతున్నట్లు చెప్పాడు. దీంతో నిజమే అని నమ్మి, తన ఫోన్‌కు వచ్చిన రిక్వెస్ట్‌పై క్లిక్ చేశారు. అంతే తన బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ అయిపోయింది.
Digital Payments Security : డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!