ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Holes for Drinking Water Pipelines in Sewers: గరళంగా మారుతున్న మంచినీరు..అమృత్‌ పనులు పూర్తి చేయని వైసీపీ సర్కారు - Sewage Water Treatment

Holes for Drinking Water Pipelines in Sewers: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మురుగుకాల్వల్లో తాగునీటి పైపులైన్లు ప్రజారోగ్యానికి ప్రమాదంగా మారాయి. పైపులైన్లకు రంధ్రాలు పడి మంచినీరు గరళంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకం కింద చేపట్టిన పనులను నేటికీ సర్కారు పూర్తి చేయలేదు. సమీక్షలతో కాలం గడపడం తప్ప డ్రెయిన్లలోని పైపులైన్ల పునరుద్ధరణపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.

Holes_for_Drinking_Water_Pipelines_in_Sewers
Holes_for_Drinking_Water_Pipelines_in_Sewers

By

Published : Aug 13, 2023, 11:25 AM IST

Holes_for_Drinking_Water_Pipelines_in_Sewers: గరళంగా మారుతున్న మంచినీరు

Holes for Drinking Water Pipelines in Sewers : ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఇంటికీ రోజూ నీరందించేలా చూడాలి. తాగు నీటి పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి కాలుష్యంపైనా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి జిల్లాలోనూ రోజూ నీటి నమూనాలను పరీక్షించాలి.‌ ఇదీ 2022 మే 7న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షలో సీఎం జగన్‌ చెప్పిన మాటలివి.! కానీ క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని అనేక చోట్ల మురుగుకాల్వల్లో తాగునీటి పైపు లైన్లు ఉన్నాయి. వాటికి రంధ్రాలు పడి మంచినీరు కలుషితమవుతోంది.

Water is Getting Polluted in State :రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో 18 వేల 240 కిలోమీటర్ల మేర తాగునీటి పైపులైన్లు ఉండగా.. ఇందులో 40 శాతం వరకు నాలుగైదు దశాబ్దాల క్రితం వేసినవే. పాతికేళ్లకోసారి వీటిని మార్చడం ద్వారా కలుషిత నీటి సమస్య పరిష్కరించొచ్చని నిపుణులు సూచనలిస్తున్నా.. సర్కారు నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఇందుకయ్యే ఖర్చును స్థానిక సంస్థలు సమకూర్చుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వమూ ప్రత్యేకంగా నిధులివ్వడం లేదు. స్థానిక పాలకవర్గాలే తాత్కాలిక మరమ్మతులతో నెట్టుకొస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల్లో పైపుల రంధ్రాల చుట్టూ సైకిల్‌ ట్యూబ్‌లు కడుతున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

Drinking Water Pipeline in drainage దారుణం.. మురుగు నీటి కాలువలో తాగు నీటి వైపులైన్! రోగాల బారిన ప్రజలు..

Government Neglected Amrit Scheme :విజయనగరం కార్పొరేషన్‌లో దాదాపు 50 శాతం మంచినీటి పైపులైన్లు మురు గుకాల్వలను ఆనుకుని ఉన్నాయి. విశాఖలో పాతనగరం, కంచరపాలెం, మద్దిలపాలెం, గాజువాక, గోపాలపట్నంలో మంచినీటి పైపులపై మురుగు పారుతోంది. శ్రీకాకుళం జిల్లాలోని పురపాలక సంఘాల్లోనూ ఇదే పరిస్థితి. నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరినపుడే అధికారులు తాత్కాలిక చర్యలతో మమ అనిపిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని కొన్ని పురపాలక సంఘాల్లో నీళ్లు దుర్వాసన వస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. నెల్లూరు నగరపాలక పరిధిలో చాలాచోట్ల నీరు కలుషితమై రంగు మారుతోంది. కొన్ని ప్రాంతాల్లో దుర్వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఒంగోలు నగరంలోని చాలా ప్రాంతాల్లో మురుగు కాల్వల్లో ఉన్న పైపుల నుంచే ఇళ్లకు మంచి నీరు సరఫరా అవుతోంది. మార్కాపురంలోనూ ఇదే పరిస్థితి. అనంతపురం జిల్లా గుంతకల్లులో తాగునీరు రంగుమారుతోంది. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోనూ పైపులైన్లు పాడై కొన్నిచోట్ల కుళాయిల్లోంచి మురుగునీరు వస్తోంది. 9 కోట్లతో కొత్త పైపులైన్లు వేయాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి.

Drinking water Problem in Ananthapur ఇంకా తాగునీటి కష్టాలా..! పాలకులు.. కాస్త దృష్టి పెట్టండి..!
రాష్ట్రంలో 5వేల 34 కిలోమీటర్ల మేర మంచినీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఇంత వరకు ముందుకు కదల్లేదు. గత ప్రభుత్వ హయాంలో అమృత్‌ పథకంలో భాగంగా ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు సహాయంతో 7వేల 802 కిలోమీటర్ల మేర 2 వేల కోట్లతో కొత్త పైపులైన్ల పనులు చేపట్టారు.

వైసీపీ అధికారంలోకొచ్చాక బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడంతో పనులు నిలిచిపోయాయి. పాడైన పైపులైన్ల స్థానంలో అత్యవసరమైన చోట్ల కొత్తవి ఏర్పాటు చేసేందుకు క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేరుతో చేపట్టిన పనులను నేటికీ ప్రభుత్వం పూర్తి చేయలేదు.

State Govt ignore Jaljeevan Mission: తాగునీటికి పైసా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు

ABOUT THE AUTHOR

...view details