ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ షర్మిల పాదయాత్రపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు - ys sharmila petition

HC HEARING ON SHARMILA PETITION: తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని వైఎస్ షర్మిల వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు అనుమతిచ్చాక పోలీసులెలా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ నేతలందరూ పాదయాత్రల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించింది.

high court
తెలంగాణ హైకోర్టు

By

Published : Dec 13, 2022, 5:04 PM IST

HC HEARING ON SHARMILA PETITION: షర్మిల పాదయాత్ర అనుమతి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు అనుమతిచ్చాక పోలీసులెలా పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ నేతలందరూ పాదయాత్రల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొంది. కోర్టు ఆర్డర్ ఇచ్చినా షర్మిల అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తెలంగాణను తాలిబాన్ల రాష్ట్రంగా మారుస్తున్నారని షర్మిల అన్నారని పేర్కొన్నారు.

రాజ్‌భవన్ నుంచి బయటకొచ్చాక వైఎస్ షర్మిల ఈ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాజభవన్ దగ్గర వ్యాఖ్యలు చేస్తే పాదయాత్రకు ఎందుకు అనుమతి నిరాకరించారని ధర్మాసనం ప్రశ్నించింది. బీఆర్‌ఎస్‌ నేతలపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ.. రాష్ట్రం గురించి వ్యాఖ్యానించడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణమని వెల్లడించింది. అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతులు గుర్తుంచుకోవాలని షర్మిలకు తెలంగాణ హైకోర్టు సూచించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details