High Court on Big Boss Show : టీవీ ప్రసారాల్లో అశ్లీలతపై అభ్యంతరం ఉన్నవాళ్లు నేరుగా హైకోర్టుకు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. హింస, అశ్లీలత, అసభ్యత ఉందని పిల్ దాఖలైనందున.. ఆ వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మాటివీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. బిగ్ బాస్‌షో కంటే మించిన ఆశ్లీలత ఉన్న కార్యక్రమాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యనించింది. ఇటువంటి వాటిపై అభ్యంతరాలు ఉంటే వీక్షించటం మానేయాలని తెలిపింది.
టీవీల్లో అశ్లీలతపై ఫిర్యాదులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి: హైకోర్టు - బిగ్ బాష్షో హైకోర్టు
High Court on Big Boss Show : హింస, అశ్లీలత, యువతను చెడు మార్గంలో నడిపే విధంగా.. బిగ్ బాష్షో ఉందని దాఖలైన పిటషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను న్యాయస్థానం అదేశించింది. వాదోపవాదాలు విన్న హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
హింస, అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించేదిగా, యువతను చెడుమార్గంలోకి నడిపేదిగా.. బిగ్ బాస్ రియాల్టీ షో ఉందని పేర్కొంటూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ పీ వెంకట జోతిర్మయితో కూడిన ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. పిటిషనర్ తరపున గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు. కార్యక్రమాన్ని సెన్సార్ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని వాదించారు. . బిగ్ బాస్ షోలో పాల్గొనే వారు.. జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్నారని తెలిపారు. అభ్యంతరకర టీవీ షోల కట్టడికి ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా షో నిర్వహించారన్నారు. న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించటంతో.. స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయటానికి సమయం కోరారు. దీనికి స్పందిస్తూ గడువుకు అంగీకరించింది.
ఇవీ చదవండి :