ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏఐవైఎఫ్ బస్సు యాత్రపై సానుకూలంగా స్పందించిన హైకోర్టు - ap latest news

AIYF Bus yatra : ఏఐవైఎఫ్​ తలపెట్టిన బస్సుయాత్రకు తగిన ఉత్వర్వులివ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. యాత్రకు డీజీపీ అనుమతి కోసం.. ఏఐవైఎఫ్ గతంలోనే ఆయన అనుమతిని కోరింది. దీనిపై డీజీపీ స్పందించకపోవటంతో వారు హైకోర్టును సంప్రదించారు.

high Court
హైకోర్టు

By

Published : Jan 20, 2023, 7:34 AM IST

High Court on AIYF Bus yatra : ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలనే డిమాండ్‌తో.. అఖిల భారత యూత్‌ ఫెడరేషన్‌ తలపెట్టిన బస్సు యాత్రకు అనుమతి విషయంలో తగిన ఉత్తర్వులివ్వాలని.. రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు బస్సుయాత్రకు ఏఐవైఎఫ్​ సిద్ధమైంది. ఈ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. డీజీపీకి లేఖ రాసింది.

డీజీపీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవటంతో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్​ తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. బస్సు యాత్రను శాంతియుతంగా నిర్వహిస్తారని కోర్టుకు తెలిపారు. సమావేశాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌ నుంచి వివరాలు సేకరించి ప్రక్రియను 4 రోజుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఈమేరకు ఆదేశాలిచ్చారు. . తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 25కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details