ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YCP MLC: ఎమ్మెల్సీ అనంత బాబు కేసు.. వేసవి సెలవుల తర్వాత వాదనలు వింటామన్న కోర్టు... - కోర్టు వార్తలు

Ananta Babu: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సీబీఐతో విచారించాలని అనంతబాబు తల్లి వేసిన పిటీషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ విచారణకు వచ్చే అంశంలో తన వాదనలు వినాలంటూ నిందితుడు ఎమ్మెల్సీ అనంత్ బాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వేసవి సెలవుల తరువాత వాదనలు వింటామని.. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 25, 2023, 10:19 PM IST

YCP MLC Ananta Babu: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఇప్పటికే.. బెయిల్ పై ఉన్నాడు. అయితే, సుబ్రహ్మణ్యం హత్య కేసులో తమకు న్యాయం జరగదు అంటూ అతని తల్లి మెుదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. కేసును సీబీఐతో విచారించాలని డిమాండ్ చేస్తోంది. అనంతబాబు తల్లి తరఫున జడ శ్రావణ్ కుమార్ కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు హైకోర్టులో సుబ్రహ్మణం తల్లి దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరిగింది. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. సీబీఐ విచారణకు ఇచ్చే అంశంలో తన వాదనలు వినాలంటూ నిందితుడు ఎమ్మెల్సీ అనంత్ బాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వేసవి సెలవుల తరువాత వాదనలు వింటామని.. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇసుక దందా: రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తెచ్చిన నాటి నుంచి అధికార పక్షానికి చెందిన నేతలకు.. ఇసుక దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణ చేస్తూ దొరికిపోయిన వారిపై పోలీలుసు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై నందిగామ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణపై జై భీం నేతలు కోర్టులో కేసులు వేశారు. నందిగామ నియోజకవర్గం పరిధిలోని గని ఆత్కూర్, జొన్నలగడ్డ, కంచర్ల, ఐతవరం, మాగల్లు తదితర గ్రామాల్లో ఇసుక అక్రమ తవ్వకాలను నిలువరించాలని కోరుతూ న్యాయవాది జై భీం శ్రీనివాస్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్, ఎమ్మెల్సీ అరుణ్ కు గతంలో ఇచ్చిన నోటీసులు చేరలేదని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వారివురుకి వ్యక్తిగత నోటీసులివ్వాలని హైకోర్టు ఆదేశించింది . తదుపరి విచారణను వాయిదా వేసింది.

తెలుగుదేశం నేతలు ఫిర్యాదు: యర్రగొండపాలెం ఘటనలో మాజీ ముఖ్యమంత్రిని అడ్డుకున్న మంత్రి, అతని అనుచరులపై తెలుగుదేశం నేతలు ఫిర్యాదుచేస్తే ఎఫ్.ఐ.ఆర్ నుంచి మంత్రి పేరు ఎలా తొలగిస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిలదీశారు. మంత్రిని కాపాడాలనుకుంటున్న పోలీసులు రేపు గవర్నర్ కు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. యర్రగొండపాలెంలో విఫలమైన పోలీసులు, నేటి చంద్రబాబు పల్నాడు పర్యటనలో కూడా విఫలమైతే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డే బాధ్యులవుతారన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details