ఆంధ్రప్రదేశ్

andhra pradesh

HAWALA MONEY: హైదరాబాద్​లో రూ.70లక్షల హవాలా డబ్బు సీజ్​

By

Published : Oct 28, 2022, 12:47 PM IST

HAWALA MONEY IN TELANGANA: తెలంగాణ రాష్ట్రంలో హవాలా డబ్బును తరలించే దందా రోజురోజుకీ పెరిగిపోతుంది. అయితే తాజాగా రూ.70లక్షల హవాలా సొమ్మును హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి రశీదు లేకుండా ఈ డబ్బును తరలించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

HAWALA MONEY IN TELANGANA
హవాలా డబ్బు

HAWALA MONEY SIEDE: హైదరాబాద్​లో మరోసారి హవాలా డబ్బు పట్టుబడింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 70 లక్షల రూపాయల హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ ద్వారకాపురి కాలనీలో తనిఖీలు నిర్వహించారు. వెంటనే పోలీసులను తప్పించుకుంటూ ఓ కారు ఆగకుండా చెక్‌పాయింట్‌ దాటి వెళ్లిపోయింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు కారును వెంబడించారు.

కొంత దూరం వెళ్లిన తరవాత కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా.. నోట్ల కట్టలు ఉన్న బ్యాగు దొరికింది. ఆ బ్యాగులో 70లక్షల రూపాయలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి రశీదు లేదని చెప్పారు. ఈ డబ్బుకు సంబంధించి పట్టుబడిన వ్యక్తులు ఎటువంటి పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

దీంతో హవాలా సొమ్ము తరలిస్తున్న కిషన్‌రావు, వేముల వంశీ అనే ఇద్దరు నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి కారు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డబ్బుల తరలింపునకు సంబంధించి మరో నిందితుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరికి ఇవ్వడానికి తీసుకెళ్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details