ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ ప్రభుత్వం వచ్చాక.. చేనేత కార్మికులకు అందని ద్రాక్షాలా మారిన రాయితీలు - Handloom workers are suffering

Handloom workers: నేతన్న నేస్తం ఇస్తున్నాం... చేనేత కార్మికుల జీవితాలు మారిపోతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఒకవైపు నేతన్న నేస్తం ఇస్తూ... మరోవైపు రాయితీల రూపంలో కార్మికులకు రావాల్సిన లక్షల రూపాయలను ప్రభుత్వం నిలిపివేసిందని చేనేత కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు.

Handloom workers
జగన్​ ప్రభుత్వం వచ్చాక.. చేనేత కార్మికులకు అందని ద్రాక్షాలా మారిన రాయితీలు

By

Published : Feb 2, 2023, 11:04 AM IST

జగన్​ ప్రభుత్వం వచ్చాక.. చేనేత కార్మికులకు అందని ద్రాక్షాలా మారిన రాయితీలు

Handloom workers: రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా చేనేత ఉంది. ఈ పరిశ్రమపై దాదాపు రెండున్నర లక్షలకు పైగా చేనేత కార్మికులు ఆధారపడి ఉన్నారు. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు రాయితీలు ఇవ్వడం నిలిపివేశారు. చేనేత సహకార సంఘాలలో పనిచేస్తున్నా తమకు ఉపాధి అవకాశం కల్పించటంలో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవటం లేదని కార్మికులు వాపోతున్నారు. దీంతో చాలామంది వృత్తిని విరమించే పరిస్థితి ఏర్పడిందని కార్మికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం ఇస్తున్నా.. వారికి అందాల్సిన మిగితా ఫలాలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 30 రోజుల్లో 25 రోజులు తగ్గకుండా పని ఉండేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 రోజులు పని రావడమే కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు.

ఒకప్పుడు బాగా పని చేసిన చేనేత సంఘాలు ప్రస్తుతం కుదేలవుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మగ్గాలపై మాత్రమే కార్మికులు ఉత్పత్తి చేస్తున్నారు. క్రమంగా ఇవీ కూడా తగ్గిపోతున్నాయి. గతంలో అందరూ కలిసి చీరలను నేసేవారు. దీని వల్ల ఉత్పత్తి ఎక్కువగా జరగడంతో పాటు కార్మికులకు ఆదాయం కూడా బాగా వచ్చేది. ప్రభుత్వం స్వంత మగ్గం ఉన్నవారికే జగనన్న చేయుత ఇస్తామని చెప్పడంతో ఎవరికి వారు విడివిడిగా తమ తమ ఇళ్లలోనే మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఉత్పత్తి సామార్థ్యం సన్నగిల్లుతోంది. కుటుంబమంతా కష్టపడినా నెలకు 10 చీరలకంటే ఎక్కవ పూర్తి చేయడం లేదని కార్మికులు చెబుతున్నారు.

చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న చీరలను చేనేత సంఘాలు కూడా మార్కెటింగ్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. సంఘాలే అప్పుల్లో ఉంటే ఇంకా కార్మికుల సంక్షేమాన్ని ఏ విధంగా చుస్తాయన్నది ప్రశ్నర్థకంగా మారింది. పావలా వడ్డీ రాయితీ, త్రిప్ట్​ఫండ్, వస్త్ర రాయితీ, మార్కెట్ ఇన్సెంటివ్ పేరుతో కార్మికులకు సంవత్సరానికి దాదాపు లక్ష రూపాయల వరకు లాభం వచ్చేదని, ఇప్పుడు 26 వేలు ఇచ్చి సరిపెడుతున్నారని కార్మికులు చెబుతున్నారు. నమ్మి ఓటు వేస్తే ముఖ్యమంత్రి జగన్ తమకు అన్యాయం చేస్తున్నారని అవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు గతంలో వచ్చే రాయితీలను అమలు చేయాలని కోరుతున్నారు. చేనేత కార్మికులు ఇబ్బందులు పడకుండా వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని కార్మికులే చెబుతున్నారు. గతంలో వారికి అందే పావలా వడ్డీ రాయితీ, త్రిప్ట్​ఫండ్, వస్త్ర రాయితీ, మార్కెట్ ఇన్సెంటివ్ ను తిరిగి అమలు చేయాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details