Governor Abdul Nazir Speech in YSR Awards: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 'వైఎస్సార్ అవార్డుల' ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన (గవర్నర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సభలో ప్రసంగిస్తూ.. 27 మంది అవార్డు గ్రహితలకు అభినందనలు తెలిపారు.
Governor Comments: ''ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. సాగునీటి రంగం, వ్యవసాయం, వైద్యం, విద్య, 108 లాంటి సేవలు అందించిన వైఎస్అర్ ప్రజలకు ఎప్పుడూ గుర్తుండిపోతారు. ఏపీలో మొదలుపెట్టిన ఈ 108 సేవలు.. దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు వైఎస్అర్ కృషి చేశారు. ఆయన సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూడా కృషి చేశారు. వైఎస్సార్ చేసిన సేవలకు గాను ఆయన పేరిట 'వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, వైయస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు' ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉంది. సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ఇండికేటర్‌లలో ఏపీ అగ్రగామిగా ఉంది. 76 రెవెన్యూ డివిజన్‌లు, 108కి పైగా పోలీస్ సబ్ డివిజన్‌లు ఏర్పాటుతో పాలన సులభతరం అయ్యింది. ఏపీ ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను.'' అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
SKU 21st Convocation: సామాజిక రుగ్మతలపై విద్యార్ధులు పరిశోధనలు చేయాలి: గవర్నర్ నజీర్
Governor Awarded Awards to 27 People: అనంతరం వైఎస్సార్ అవార్డుల్లో 23 లైఫ్ టైం అచీవ్‌మెంట్, 4 అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపికైన వారికి గవర్నర్అబ్దుల్ నజీర్..సీఎం జగన్‌తో కలిసి అవార్డులు అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 27 మంది వ్యక్తులు, సంస్థలకు ఆయన పురస్కారాలను అందజేశారు.