Vijayawada Autonagar issue: దేశంలో ఏర్పాటైన తొలి ఆటోనగర్‌గా విజయవాడ జవహర్ ఆటోనగర్‌కు పేరు. ఆటో మొబైల్, వాహనాల విడిభాగాల తయారీ, అమ్మకాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. 1966లో బెజవాడ శివారులో పారిశ్రామిక ఎస్టేట్ పక్కన సుమారు 275ఎకరాల స్థలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. దీనిపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు. లారీలు, బస్సులకు బాడీలు కట్టడంలో ఈ ప్రాంతానికి ఎంతో పేరుంది. ఛాసిస్ వాహనాన్ని తీసుకొచ్చి కార్మికులకు అప్పగిస్తే చాలు... యజమాని అభిరుచి మేరకు ఎలా కావాలంటే అలా బాడీలు కట్టి ఇస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశాకు చెందిన యజమానులు ఇక్కడికే వచ్చి లారీలకు బాడీలు కట్టించుకొని వెళ్తుంటారు. అంతగా ప్రసిద్ధి చెందిన ఆటోనగర్‌కు... ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబరు జీవోలు గుదిబండగా మారాయి. ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్‌గా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని కార్మికులు, వ్యాపారులు తప్పుపడుతున్నారు.
పరిశ్రమలు తరలిపోతే రాష్ట్ర మనుగడకే ప్రమాదం..:60వ దశకంలో తాము స్థలాలు ఉచితంగా పొందలేదని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఆటోనగర్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. 50 శాతం పన్ను కట్టాలంటే ఇక వ్యాపారాలు వదులుకోవటమేనని అంటున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు ఉండే ప్రాంతాన్ని కమర్షియల్ చేస్తామంటే ఉపేక్షించేదే లేదని తేల్చిచెప్తున్నారు. చిన్న పరిశ్రమలు నడుపుకునే వారు పెద్దమొత్తంలో పన్నులెలా కడతారని వ్యాపారులు నిలదీస్తున్నారు. పరిశ్రమలు తరలిపోతే రాష్ట్ర మనుగడకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ తీరుతో... ప్రశ్నార్ధకంగా విజయవాడ ఆటోనగర్ మనుగడ - విజయవాడ ఆటోనగర్
Vijayawada Autonagar issue: ఆసియాలోనే అతి పెద్దదిగా పేరొందిన విజయవాడ జవహర్ ఆటోనగర్ మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది. ఆటోనగర్‌ను కమర్షియల్ ప్రాంతంగా పేర్కొంటూ... ప్రభుత్వం జీవోలు తేవడంపై కార్మికులు, వ్యాపారులు భగ్గుమంటున్నారు. మార్కెట్ విలువ ప్రకారం 50శాతం పన్ను రూపేణా వసూలుకు సిద్ధమవడాన్ని తప్పుపడుతున్నారు.
ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం..: ఆటోనగర్‌కు ప్రస్తుతం వాహనాలు భారీ సంఖ్యలో వచ్చే పరిస్థితులు లేవని ..బతుకే కష్టంగా ఉన్న సమయంలో పన్నుల వాతలేంటని ప్రశ్నిస్తున్నారు. ఆటోనగర్‌ను ఆనుకుని ఉన్న కానూరు పారిశ్రామిక ప్రాంతాన్ని సొంతగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏపీఐఐసీకి సర్వీస్ ఛార్జీ రూపేణా రుసుము కడుతున్న విషయాన్ని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. 5, 6 జీవోలను ఉపసంహరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి:CBN On Power Cuts: రాష్ట్రం చీకట్లోకి వెళ్లిపోయింది - చంద్రబాబు