AP Paid Loan To RBI : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ నుంచి బయటపడింది. కార్పొరేషన్ల సాయంతో అప్పు తెచ్చి రిజర్వుబ్యాంకు రుణం తీర్చింది. డిసెంబరు 17 నాటికి ఓవర్ డ్రాఫ్ట్ నుంచి బయటపడకుంటే ఇబ్బందులు తప్పవని ఆర్బీఐ హెచ్చరించిన నేపథ్యంలో ఏపీ సర్కార్ మళ్లీ కార్పొరేషన్లను ఆశ్రయించింది. రెండు ప్రభుత్వ కార్పొరేషన్ల పేరిట జాతీయ బ్యాంకుల నుంచి 2,300 కోట్ల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మొత్తంతో ఓవర్ డ్రాఫ్ట్ రుణం తీర్చేశారు. చేబదుళ్ల రూపంలో తెచ్చిన కొంత అప్పునూ చెల్లించారు. సొంత రాబడుల ఆధారంగా.. మరికొన్ని అత్యవసర చెల్లింపులూ చేశారు.
ఓవర్ డ్రాఫ్ట్ నుంచి బయట పడిన ప్రభుత్వం.. కార్పొరేషన్ల పేరిట రుణం
AP Paid Loan To RBI : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వుబ్యాంకు రుణం తీర్చింది. నిర్ణీత గడువులోగా ఓవర్డ్రాఫ్ట్ నుంచి బయట పడకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించటంతో.. ఈ మేరకు రుణాన్ని తీర్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వుబ్యాంకు
ఇకపై పెండింగు జీతాలు, పింఛన్ల చెల్లింపులు మొదలవుతాయని తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ కార్పొరేషన్లు తీసుకుంటున్న రుణాలను.. తమ సొంత కార్యకలాపాలకు మాత్రమే వినియోగించుకోవాలి. ప్రభుత్వాలు వాడుకోవడం నిబంధనలకు విరుద్ధమని.. కేంద్ర ఆర్థికశాఖ పలుమార్లు పేర్కొంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. ఏపీకి మళ్లీ కార్పొరేషన్ల రుణమే దిక్కయిందని సమాచారం.
ఇవీ చదవండి: