ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భలే చౌక బేరం.. వైసీపీకి మరో విలువైన స్థలం.. 33 ఏళ్లకు రూ.33 వేలు - ప్రభుత్వ భూమి లీజుకు తాజా సమాచారం

Govt Land will be Leased for YCP Office: వైసీపీ కార్యాలయాల భవనాల కోసం ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేస్తూనే ఉంది. విజయవాడ విద్యాధరపురంలో రూ.18.50 కోట్ల విలువైన 1,850 చదరపు గజాల ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రభుత్వం భూములు
ప్రభుత్వం భూములు

By

Published : Jan 6, 2023, 10:51 AM IST

Govt Land will be Leased for YCP Office: వైసీపీ కార్యాలయాల భవనాల కోసం ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేస్తూనే ఉంది. విజయవాడ విద్యాధరపురంలో రూ.18.50 కోట్ల విలువైన 1,850 చదరపు గజాల ప్రభుత్వ భూమిని వైసీపీ కార్యాలయ భవన నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతనెల 20న జారీచేసిన జీఓ గురువారం వెబ్‌సైట్‌లో కనిపించింది.

చనుమోలు వెంకట్రావు వంతెనకు వెళ్లే మార్గంలో, ఆర్టీసీ వర్క్‌షాప్‌ సమీపంలో ఈ భూమి ఉంది. గతంలో ఇక్కడ సీఐటీయూ కార్యాలయం ఉండగా కార్పొరేషన్‌ స్వాధీనం చేసుకుంది. ఈ స్థలాన్ని పార్కు కోసం అభివృద్ధి చేసేలా కొన్నాళ్లు హడావుడి చేశారు. చివరికి ఇదే స్థలాన్ని అధికార పార్టీకి ఏడాదికి రూ.1,000 మాత్రమే చెల్లించేలా 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details