Governing Bodies Of Temples: రాష్ట్రంలోని మూడు ప్రధాన దేవాలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని దుర్గామల్లేశ్వర స్వామి ఆలయం, అన్నవరంలోని సత్యనారాయణ స్వామి ఆలయం, ద్వారకా తిరుమల దేవస్థానానికి పాలక మండళ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్నవరం దేవస్థానికి ఎల్.వి. రోహిత్‌ను చైర్మన్‌గా నియమిస్తూ 14 మంది సభ్యులతో కూడిన పాలక మండలిని నియమించారు. దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి 15 మంది సభ్యులతో పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అటు ద్వారకా తిరుమల దేవస్థానానికి ఎస్.వి. సుధాకర్ రావు చైర్మన్‌గా 15 మందితో కూడిన పాలక మండలిని ప్రభుత్వం నియమించింది.
మూడు ప్రధాన దేవాలయాలకు పాలక మండళ్లు నియామకం.. ఉత్తర్వులు జారీ
Governing Bodies Of Temples: రాష్ట్రంలోని మూడు ప్రధాన దేవాలయాలకు పాలక మండళ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి, అన్నవరం దేవస్థానం, ద్వారకా తిరుమల దేవస్థానానికి పాలకమండళ్లు నియమించింది.
దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు