CASH TRANSCATION LIMIT INCREASED : నగదు లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల వద్ద గతంలో రూ.500గా ఉన్న వ్యక్తిగత నగదు పరిమితిని రూ.వెయ్యికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ ఫోన్లలో వివిధ డిజిటల్ యాప్‌లు అందుబాటులో ఉన్నందున నగదు లావాదేవీలు నిర్వహించే ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో నగదు ఉంచుకోవడం లేదని పేర్కొంది. ఈ లావాదేవీలు నిర్వహించే విభాగాల ఉద్యోగులు, రెవెన్యూ వసూళ్లు చేసే వారు విధులకు హాజరయ్యే సమయంలో రూ.వెయ్యి కంటే ఎక్కువ నగదు ఉంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. ఏసీబీ ఇచ్చిన సిఫార్సుల మేరకు దీనిని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ప్రభుత్వ ఉద్యోగుల జేబుల్లో రూ. వెయ్యి మాత్రమే ఉండాలి.. ప్రభుత్వం ఉత్తర్వులు - ap latest news
CASH TRANSCATION LIMIT INCREASED: నగదు లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల వద్ద వ్యక్తిగత నగదు పరిమితిని వెయ్యి రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 500 రూపాయల పరిమితిని రూ.1000కి పెంచుతున్నట్టుగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
CASH TRANSCATION LIMIT INCREASED