ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందుబాబులకు శుభవార్త.. అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలు - మద్యం అమ్మకాల సమయాల్లో సడలింపు

Liquor Sales Time Extension: మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ల విక్రయ సమయాన్ని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 31వ తేదీతో పాటు 1వ తేదీన మొత్తంగా రెండు రోజులు పాటు.. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ నిర్వహించే మద్యం దుకాణాలకు 12 గంటల వరకూ.. హోటళ్లు, ఈవెంట్లు, బార్లకు రాత్రి 1 గంట వరకూ అనుమతిచ్చింది.

liquor sales timings in ap
మద్యం దుకాణాలు సమయం

By

Published : Dec 31, 2022, 3:50 PM IST

Liquor Sales Time Extension: నూతన సంవత్సర వేడుకల్ని పురస్కరించుకుని మద్యం దుకాణాలు, బార్లలో మద్య విక్రయ సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ నిర్వహించే మద్యం దుకాణాల్లో విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకూ.. హోటళ్లు, ఈవెంట్లు, బార్లలో విక్రయాల సమయాన్ని రాత్రి 1 గంట వరకూ అనుమతిచ్చింది. 31 తేదీతో పాటు 1 తేదీ మొత్తంగా రెండు రోజుల పాటు సమయాన్ని పొడిగిస్తూ ఆబ్కారీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో అక్రమ మద్యం, నాటు సారా విక్రయాలపై నియంత్రణ పెట్టాల్సిందిగా ఎక్సైజు శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details