Girl dead తల్లిదండ్రులు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారికి చిన్న దెబ్బతగిలినా తల్లిదండ్రులు తమ ప్రాణం పోయినంతాగా బాధ పడుతుంటారు. అలాంటిది కుమార్తె సంతోషం కోసం కట్టిన ఊయ్యాలే, తన కుమార్తెను చంపెస్తుందని ఎందుకు భావిస్తాడు ఆ తండ్రి. కాని ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో అలాగే జరిగింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది ఈ ఘటన.
ఊయలే ఉరితాడుగా మారింది.. ఆ తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది - లలితశ్రీ ఊయలే ఉరితాడుగా మారి ఏడేళ్ల చిన్నారి మృతి
Girl dead ఊయలే ఉరితాడుగా మారి ఏడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నవాబుపేటలో జరిగింది. ఒకటో తరగతి చదువుతున్న బాలిక, తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా.. చీరతో కట్టిన ఉయ్యాల ఊగుతున్న సమయంలో మెడకు బిగుసుకుని చనిపోయింది.
ఊయలే ఉరితాడుగా మారి ఏడేళ్ల చిన్నారి మృతి
తానూరి గోపి, తిరుపతమ్మ దంపతుల పెద్ద కుమార్తె లలితశ్రీ ఒకటో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లారు. లలితశ్రీ చీరతో కట్టిన ఉయ్యాల ఊగుతున్నసమయంలో మెడకు బిగుసుకుపోవడంతో అపస్మారకస్థితికి వెళ్లింది. పక్కనే ఉన్న బంధువులు గమనించి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరిగిన చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.
ఇవీ చదవండి:
TAGGED:
Girl 7 dies