ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 15, 2023, 11:12 AM IST

ETV Bharat / state

Gay Murder Case: గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యి.. ప్రాణం తీశాడు

Gay Murder Case: వారిద్దరూ గే డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. ఏకాంతంగా కలుసుకున్నారు. ఇంతలో వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరి ప్రాణం పోయింది. తొలుత ఈ కేసును అనుమానాస్పద మృతిగా పోలీసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. అది ఏంటంటే..?

Gay Murder Case
గే మర్డర్ కేసు

Gay Murder Case: ఎన్టీఆర్ జిల్లా పటమట పోలీస్ స్టేషన్లో గత నెల 18న అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు చిక్కుముడి వీడి హత్య కేసుగా మారి మలుపు తిరిగింది. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఇద్దరు స్వలింగ సంపర్కులకు 'గే డేటింగ్ యాప్'లో పరిచయం ఏర్పడిన తర్వాత ఏకాంతంగా కలిశారు. ఈ సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగి ఒకరు మృతికి దారితీసింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేయగా.. ఇది హత్యని తేలింది.

ఇప్పటి వరకు లోన్ యాప్ల వేధింపులతో ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. ఇప్పుడు ఏకంగా డేటింగ్ యాప్ వలలో పడి ప్రాణాలు పోగొట్టుకోవడం సంచలనంగా మారింది. కృష్ణా జిల్లా యనమలకుదురుకు చెందిన మూడావత్తు ప్రసాద్(30) చెక్​పోస్ట్ సెంటర్లోని రిలయన్స్ ట్రెండ్స్​లో హౌస్ కీపింగ్ చేస్తాడు. అతడికి రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. ప్రసాదుకు 'గ్రైండర్ అనే గే డేటింగ్ యాప్ ద్వారా కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన 23 ఏళ్ల తంగెళ్లముడి సాయికృష్ణ పరిచయమయ్యాడు.

AP Crime News: మరదలిపై హత్యాయత్నం.. గిరిజన మహిళపై అత్యాచారం

సాయికృష్ణ గుంటూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వార్డెన్​గా పని చేస్తున్నాడు. ఇతడు గత నెల 18వ తేదీన యనమలకుదురులోని తన బంధువుల సంవత్సరీకానికి వచ్చాడు. ఈ సమయంలో ప్రసాద్​కు ఫోన్ చేసి ఇద్దరూ కలిసి యనమలకుదురు కట్ట వద్ద ఉన్న ఓ బార్లో మద్యం తాగారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో కృష్ణా నదీ తీరానికి వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సాయికృష్ణ కర్రతో ప్రసాద్ తల, భుజంపై దాడి చేయగా.. ప్రసాద్ తల వెనుక భాగంలో కనిపించని బలమైన గాయం అయ్యింది.

అనంతరం ఇద్దరూ కలిసి నది నుంచి యనమలకుదురు పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ప్రసాద్ ఆటోలో ఎక్కివస్తుండగా పటమట దొంక రోడ్డు వద్దకు రాగానే కుప్పకులిపోయాడు. ఆటోడ్రైవర్ శ్రీనివాసరావు అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీనిపై మృతుడు ప్రసాద్ భార్య ఫిర్యాదు మేరకు అతడిది అనుమానాస్పద మృతి కింద పటమట పోలీసులు కేసు నమోదు చేశారు.

3రోజులుగా కుళ్లిన మృతదేహాల మధ్య నవజాత శిశువు.. తల్లిపాలు లేకున్నా ఆరోగ్యంగానే..

తర్వాత పోస్టుమార్టం నివేదిక పరిశీలించగా.. బలమైన ఆయుధంతో తలపై కొట్టడం వల్లే ప్రసాద్ చనిపోయాడని తేలడంతో హత్య కోణంలో పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా, డేటింగ్ యాప్ హిస్టరీ పరిశీలించి సాయి కృష్ణని నిందితుడిగా గుర్తించారు. మంగళవారం ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసి నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేశారు. ఇలాంటి యాప్​ల పట్ల ఆప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details