GAD Orders on All Uploading state Go's: ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం (హైకోర్ట్) వ్యాఖ్యల నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) హడావిడిగా వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో..ఇక నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీ గెజిట్ వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. కొన్ని ప్రభుత్వ విభాగాలు క్రమానుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులను అప్‌లోడ్ చేయకపోవడంపై జీఏడీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించింది. గతంలోనే ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో జీవోలు అప్‌లోడ్ చేసేందుకు జీఏడీ ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించింది.
GAD Note on Govt GO'S: జీవోలు ఏపీ గెజిట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని.. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని విభాగాలు జీవోలు అప్‌లోడ్ చేయకపోవడంపై జీఏడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇకపై అన్ని జీవోలు అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. దాంతోపాటు జీవోఎంఎస్, జీవోఆర్టీలను నిరంతరం అప్‌లోడ్ చేయాలని జీఏడీ నోట్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి నేటి వరకున్న జీవోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. జీవోలు అప్‌లోడ్ చేసి, వాటి వివరాలు కేబినెట్ సెక్షన్ అధికారికి పంపాలని వివరించింది. జీవోలు అప్‌లోడ్ చేయకపోతే.. ఇన్‌ఛార్జులను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. జీవోలు అప్‌లోడ్ చేయకపోవటాన్ని ఇటీవలే హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో హడావిడిగా వివిధ శాఖలకు జీఏడీ నోట్ విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వదిలేస్తే.. తహశీల్దార్లకూ సలహాదారులను నియమిస్తారేమో: హైకోర్టు