Funds Shortage to Libraries: నేటి నుంచి ఈ నెల 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధుల కొరతతో ఏపీలో గ్రంథాలయాలు (AP Libraries) వెలవెలబోతున్నాయని పాఠకులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రభుత్వ గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా లైబ్రరీలకు కనీసం వార్తాపత్రికలు వేయించడానికి కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదు. లైబ్రరీల్లో పూర్తిస్థాయిలో వార్తాపత్రికలు, పుస్తకాలు అందుబాటులో లేవని నిరుద్యోగులు, పాఠకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Shortage of Books in Andhra Pradesh Libraries: రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కేంద్ర గ్రంథాలయం లేకుండా పోయింది. రాష్ట్ర పౌర గ్రంథాలయాల కార్యాలయాన్ని మంగళగిరిలోని ఒక శాఖా గ్రంథాలయంలో నడుపుతున్నారు. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో లైబ్రరీల్లో ఖాళీగా ఉన్న 1,012 పోస్టులను భర్తీ చేయలేదని నిరుద్యోగులు నిట్టూరుస్తున్నారు. నిధుల కొరత(Shortage of Funds)తో చాలా గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు, పక్ష, మాస పత్రికలు పూర్తిస్థాయిలో అందుబాటులోలేవని నిరుద్యోగులు, పాఠకులు నిరుత్సాహం చెందుతున్నారు.
సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు!
No Funds for Libraries: ఇంటి పన్నులో 8 శాతం గ్రంథాలయాలకు సెస్ రూపంలో చేరాలి. కానీ వసూలు చేస్తున్న సొమ్మును కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు.. జిల్లా గ్రంథాలయ సంస్థలకు చెల్లించకుండా మొండికేస్తున్నాయి. విశాఖ కార్పొరేషన్ సుమారు 100 కోట్ల రూపాయలు బకాయి పడిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 109 గ్రంథాలయాలు ఉంటే.. స్థానిక సంస్థల నుంచి 34.62 కోట్ల రూపాయలు సెస్ బకాయి ఉంది.