ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రం ఇచ్చే బియ్యానికి అడ్డెందుకు..5నెలల బియ్యాన్ని నిలిపేసిన ప్రభుత్వం - ap news

Ration Distribution: ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అందనీయట్లేదు. గతేడాది అక్టోబరులో ఇవ్వాల్సిన కోటా బియ్యాన్ని.. ఈ ఏడాది జనవరిలో ఇస్తామని అప్పట్లో చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు దాని ఊసే మరచింది. గతేడాదిలో 5 నెలల పంపిణీకి మోకాలడ్డింది.

free rice
ఉచిత బియ్యం

By

Published : Jan 2, 2023, 12:49 PM IST

Ration Distribution: కొవిడ్‌ కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకునేందుకు కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ద్వారా ఉచిత బియ్యం అందజేస్తోంది. రాష్ట్రంలో 2 కోట్ల 68 లక్షల మంది పేదలకు నెలకు లక్షా 34 వేల టన్నుల చొప్పున కేటాయిస్తోంది. ఆరో విడత కింద గతేడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఇవ్వాల్సి ఉండగా.. రాష్ట్రం అందులో 4 నెలలు పంచకుండా నిలిపేసింది. కేంద్రం హెచ్చరించడంతో ఆహార భద్రత కార్డుల్లో మార్పులు చేసి.. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అందించింది. ఏడో విడతలో మళ్లీ మొండిచేయి చూపింది. ఈ బియ్యాన్ని 2023 జనవరిలో ఇస్తామని అధికారులు అప్పట్లో చెప్పారు. ఇప్పుడు ఆ బియ్యం ఊసే లేదు. అంటే గత సంవత్సరానికి సంబంధించి ఐదు నెలల బియ్యాన్ని ఇవ్వలేదు. ఈ నెల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఇచ్చే ఉచిత బియ్యాన్నే అందిస్తోంది.

కొవిడ్‌ ఆరంభం నుంచి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలోని కార్డుదారులకూ ప్రతినెలా ఉచిత బియ్యం ఇచ్చింది. గతేడాది మార్చి తర్వాత మొత్తం కార్డులకు కేంద్రమే బియ్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది. కానీ పేదలకు ఉచిత బియ్యం ఇవ్వకపోతే.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలునే నిలిపేస్తామని కేంద్రం గట్టిగా చెప్పడంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుల్లో భారీ మార్పుచేర్పులు చేసింది. 2022 ఆగస్టు నుంచి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కార్డుదారులకే పీఎంజీకేఏవై బియ్యాన్ని పరిమితం చేసింది. రాష్ట్ర కార్డుదారులకు మొండిచేయి చూపింది.

కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయని రాష్ట్ర ప్రభుత్వం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details