ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ లీలావతి గిరిజన పాఠశాల.. ఇక్కడ పేద గిరిజన పిల్లలకు ఉచిత విద్య - sri Leelavathi public School

SRI LEELLAVATHI PUBLIC SCHOOL : 38 ఏళ్లుగా వేలాది మంది పేద పిల్లలకు ఆ పాఠశాల ఆంగ్ల మాధ్యమంలో విద్యా బుద్ధులు నేర్పిస్తోంది. అందులో విద్యను అభ్యసించిన ఎంతో మంది విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. మరెందరో రాజకీయ నాయకులుగా చక్రం తిప్పుతున్నారు. ఇంత మందిని ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఆ పాఠశాల ఎక్కడ ఉందా? అని మీ సందేహామా? అయితే ఇది చదవండి..

SRI LEELLA PUBLIC SCHOOL
SRI LEELLA PUBLIC SCHOOL

By

Published : Feb 7, 2023, 10:57 AM IST

శ్రీ లీలావతి గిరిజన పాఠశాల.. ఇచట పేద గిరిజన పిల్లలకు ఉచిత విద్య

SRI LEELLAVATHI PUBLIC SCHOOL : మౌలిక వసతులకు దూరంగా మన్యంలో జీవించే నిరుపేద పిల్లలకు ఉత్తమ భవిష్యత్తును అందిస్తోంది ఈ పాఠశాల. దాదాపు నాలుగు దశాబ్దాలుగా.. అడవీ బిడ్డల్ని ఆదర్శ పౌరులుగా, ప్రభుత్వ అధికారులుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, ఇంకా మరెన్నో రకాలుగా తీర్చిదిద్ది సమాజంలో వారికంటూ ఓ గుర్తింపుని అందించింది.

విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుత సమాజంలో..లక్షలు వెచ్చించి కార్పొరేట్‌ పాఠశాలలకు వెళ్లలేని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. అదే.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని శ్రీలీలావతి గిరిజన పాఠశాల. ఉడతా లక్ష్మీనారాయణ అనే ఉపాధ్యాయుడు 1987లో జీవనాధారం కోసం ఏర్పాటు చేసిన ఈ పాఠశాల.. ఆ తరువాత కాలంలో ఎంతో మంది గిరిజన పిల్లలకు ఉత్తమ భవిష్యత్తు అందించేందుకు వారధిగా నిలిచింది.

"ఈ పాఠశాలను 1985లో నేను స్థాపించాను. నా ఉపాధి దృష్టిలో పెట్టుకుని పేద పిల్లలు, విద్యార్థులకు చదువు చెప్పాలన్న తాపత్రయంతో దీనిని ఏర్పాటు చేశాను. ఈ స్కూల్లో 1 నుంచి 7వ తరగతి వరకూ చదివే గిరిజన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నాం. ప్రతి సంవత్సరం పుస్తకాలు, బట్టలు, మధ్యాహ్న భోజన వసతి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయంతో దీనిని నిర్వహిస్తున్నాం"-ఉడతా లక్ష్మీనారాయణ, శ్రీ లీలావతి గిరిజన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తోంది. ఉడతా లక్ష్మీనారాయణ ఆధ్వర్వంలో నడుస్తున్న ఈ పాఠశాలకు.. 2001లో గిరిజన విద్యార్థుల నాన్ రెసిడెన్షియల్ స్కూల్‌గా కేంద్రం అనుమతి లభించింది. నాటి నుంచి 100 మంది గిరిజన విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. వేతనం తక్కువే అయినా.. సిబ్బంది సేవా దృక్పథంతో బోధన చేస్తున్నారని ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.

"నేను ఇక్కడ 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం. ఈ పాఠశాలలో చదువు బాగుంటది. ఎందరో పేద విద్యార్థులకు చదువు నేర్పిస్తూ.. వారిని అన్ని రకాలుగా తీర్చిదిద్దుతున్నాము"- శ్రీ లీలావతి గిరిజన పాఠశాల ఉపాధ్యాయురాలు

పిల్లల్ని కేవలం చదువుకే పరిమితం చేయక సృజనను పెంపొందించేలా వివిధ రకాల విద్యానుబంధ కార్యక్రమాలు, ఆటపాటలతో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న లక్ష్మీనారాయణ మాస్టర్ అనేక పురస్కారాలు అందుకున్నారు. అత్యుత్తమ విద్యా బోధనతోనే మెరుగైన సమాజ స్థాపన సాధ్యమని అంటున్నారు.

"ఇక్కడ చాలా మంది పేద పిల్లలకు ఉచితంగా చదువు చెపుతున్నారు. పుస్తకాలు, బట్టలు ఇలా చాలా రకాలుగా ఆదుకుంటున్నారు. మేము కూడా జీవితంలో ఉన్నత స్థానంలో ఉండి.. మా సంపాదనలో కొంత భాగం ఇలాంటి సేవా కార్యక్రమలాకు ఉపయోగించాలనుకుంటున్నాం"- విద్యార్థిని, శ్రీ లీలావతి గిరిజన పాఠశాల

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details