Boy stuck in brass vessel: ఓ బాలుడి సరదా ఆ పిల్లాడితో సహా అక్కడున్న వారిని కాసేపు ఉక్కిరిబిక్కిరి చేసింది. అప్పటిదాకా ఆడుకుంటున్న బాలుడు ఆకస్మాత్తుగా ఓ బిందెలో ఇరుక్కుపోయాడు. ఆ పిల్లాన్ని బయటికి తీసేందుకు ఓ ప్రాహాసనమే జరిగింది. ఈ విచిత్ర సంఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో జరిగింది.
గ్రామానికి చెందిన చెందిన బండి వీరాస్వామి ఇంట్లో ఇటీవల శుభకార్యం జరిగింది. ఈ వేడుకకు వీరాస్వామి సోదరి అరుణ తన నాలుగేళ్ల కుమారుడు విక్రమ్‌తో కలిసి హాజరైంది. రెండు రోజులు పుట్టింట్లో కుటుంబసభ్యుల మధ్య ఉందామనుకుని అక్కడే ఉండిపోయింది. ఇంట్లోని వారంతా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అదే సమయంలో విక్రమ్ ఆడుకుంటూ బిందెలో దిగాడు.