Boora Narsaiah Goud Joined BJP: తెలంగాణలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. భాజపా దూకుడుతో.. అధికార తెరాసకు ఇబ్బందులు తప్పెలా లేవు. ఇప్పటివరకు తెరాస గుటికి చేరిన రాజకీయ పక్షులు.. ఇప్పుడు భాజపా వైపుగా చూస్తున్నాయి. అందుకు మునుగోడు వేదికగా మారింది. చోటామోట నాయకులతో మెుదలైన చేరికలు.. తెరాసాలో ప్రభావం ఉన్న నేతలిప్పుడు కాషాయం కండువ కప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు.
ఇటీవల తెరాసకు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్, రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బూర నర్సయ్య గౌడ్‌తో పాటు పార్టీలోకి 16 మంది నేతలు చేరారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ పాల్గొన్నారు.