ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొట్టి శ్రీరాములు ఆశయాలను స్మరిస్తూ.. నటుడు సాయిచంద్​ కాలినడక దీక్ష - Padayatra News

Actor Sai Chand : పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తు చేస్తూ.. నటుడు సాయిచంద్​ కాలినడక దీక్షను ప్రారంభించారు. చైన్నై నుంచి ప్రకాశం జిల్లా పడమటి పల్లె వరకు ఈ యాత్ర కొనసాగనుంది. దీనిపై మాజీ ఉపసభాపతి మండలి బుద్థప్రసాద్ ప్రశంసలు కురిపించారు.

Actor Sai Chand
నటుడు సాయిచంద్​

By

Published : Dec 17, 2022, 5:28 PM IST

Updated : Dec 17, 2022, 5:51 PM IST

Actor Sai Chand : పొట్టి శ్రీరాములు 70వ వర్థంతి సందర్భంగా నటుడు సాయిచంద్ కాలి నడక దీక్షను ప్రారంభించారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను, అశయాలను, నేటి తరానికి గుర్తు చేయాటానికే ఈ దీక్షను చేపట్టినట్లు ఆయన తెలిపారు. సాయి చంద్ చేపట్టిన యాత్రపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రశంసించారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరం మరిచిపోయిందని అన్నారు. తెలుగు నాట సంస్కృతిక పునరుజ్జీవనోద్యామనికి పాటు పడుతూ నేను తెలుగు వాడిని అని సగర్వంగా చెప్పుకునే రోజులు రావాలని .. మండలి అభిలాషించారు. నటుడు సాయి చంద్​ చేపట్టినా యాత్ర కొందరిలోనైనా అలోచన రేకిత్తిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

​చైన్నైలోని పొట్టి శ్రీరాములు స్మారక భవనం నుంచి జన్మ స్థలమైన ప్రకాశం జిల్లా పడమటి పల్లె వరకు ఈ కాలి నడక దీక్షను కొనసాగనుంది. ఫిదా సినిమా ద్వారా ఫేమ్​ అయిన సాయి చంద్.. మా భూమి చిత్రం ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఇటీవల విడుదలైన విరాట పర్వం, సైరా నరసింహ రెడ్డి చిత్రాలలో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

నటుడు సాయిచంద్​ కాలినడక దీక్ష

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2022, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details