Fifth Day Of Navaratarti: శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదోరోజు బెజవాడ కనకదుర్గమ్మ లలితాత్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుంకుమార్చన సేవలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున ఆలయ సిబ్బంది దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారి దర్శనానికి పోటెత్తడంతో.. హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు గర్భగుడికి చేరువలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మరణించిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన శ్రీరామచంద్రమూర్తిగా పోలీసులు గుర్తించారు. అతడు తొలుత ఆలయంలో కుప్పకూలిపోయినప్పుడు.. ఫిట్స్గా భావించామని ఘటనాస్థలంలో ఉన్న భక్తులు అన్నారు.
లలితా త్రిపురసుందరీ దేవి అలంకరణలో బెజవాడ దుర్గమ్మ
Navaratri : నమామి దుర్గాభవానీ.. నమామి లలితా త్రిపురసుందరీదేవి అంటూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులు స్మరిస్తున్నారు. పూజలతో అమ్మవారిని కొలుస్తున్నారు. పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు చేతపట్టుకుని.. లక్ష్మీసరస్వతిదేవిలు వింజామరలతో ఉన్న దేవతమూర్తులను భక్తులు దర్శించుకుంటున్నారు. అయితే ఆలయంలో ఓ భక్తుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
Etv Bharat