Farmers Suicides increased in AP : గడిచిన మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కేంద్రం తెలిపింది. 2019-21 మధ్య ఏపీలో 1,673 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించింది. 2019లో 628 మంది రైతులు, 2020వ సంవత్సరంలో 564 మంది రైతులు, 2021లో 481 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించింది. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అనేక రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నా.. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో పెరుగుతున్నాయని తెలిపింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ వివరాలను వెల్లడించారు.
గడిచిన మూడేళ్లలో ఏపీలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి: కేంద్రం - రైతుల ఆత్మహత్యలు
Farmers Suicides in AP: దేశంలోని రైతుల ఆత్మహత్యల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు అధికంగానే ఉన్నాయని ప్రకటించింది. మిగతా రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గుతున్నా.. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాయని వివరించింది.
రైతుల ఆత్మహత్యలు