ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీలో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సోమేశ్ కుమార్... - వైసీపీ వార్తలు

Somesh Kumar: ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన సోమేష్ కుమార్​కు ఏ శాఖ అప్పగించాలా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. వాణిజ్య పన్నుుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Somesh Kumar
సోమెష్ కుమార్

By

Published : Jan 21, 2023, 10:27 PM IST

Ex-Telangana Chief secretary Somesh Kumar: తెలంగాణా హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ కేడర్​కు రిపోర్టు చేసిన ఆ రాష్ట్ర మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేసిన సోమేష్ కుమార్ కు ఏ శాఖ అప్పగించాలా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆయనను వాణిజ్య పన్నుుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో మరికొందరు సీనియర్ ఐఎఎస్​ల బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2019లో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, గనుల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న గోపాల కృష్ణ ద్వివేదితో పాటు సెలవు పై వెళ్లి తిరిగి రిపోర్టు చేసిన పాఠశాల విద్యాశాఖ మాజీ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్​కు ఇతర శాఖలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. గోపాలకృష్ణ ద్వివేదికి వ్యవసాయ శాఖతో పాటు బుడితి రాజశేఖర్​కు పంచాయితీ రాజ్ శాఖలు అప్పగిస్తారని సమాచారం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details