Children's Day Special Story : హ్యాపీ చిల్డ్రన్స్‌డే అని మొక్కుబడిగా చెప్పుకోవడం కాదు.. పిల్లలకు నొక్కి చెప్పాల్సిన రోజు నేడు. చాచానెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పిల్లలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ చిన్నారులకే కాదు తల్లిదండ్రులకు తమబాధ్యతను గుర్తుచేసే రోజు. మరిచిపోలేని గాయాలెన్నో ఆ పసి హృదయాలను వెంటాడుతున్నాయి. వాటికి కళ్లెం వేసి చిన్నారులకు బంగారు భవిష్యత్‌ను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పరుగులుపెట్టాల్సిన నేటితరం చిన్నారులు నడవడానికే ఇబ్బందిపడుతోంది.
Children's Day Story : ఆ రుగ్మత.. గతంతో పోలిస్తే తీవ్రంగా పెరుగుతోందని దిల్లీలోని ఓ ఆస్పత్రి పరిశోధనలో తేలింది. పోషక విలువలలోపం ఇందుకు ప్రధాన కారణమని నిర్ధరించారు. గతంతో పోలిస్తే జీవన ప్రమాణాలు పెరిగి.. కన్నవాళ్ల ఆదాయం రెట్టింపైంది. ఎక్కడా ఆకలి సమస్యలు లేవు. కానీ ప్రాసెస్డ్ ఆహారానికి బానిసలవుతున్నారు. పిజ్జా బర్గర్ల మోజులోపడిపోతున్నారు. సంప్రదాయ ఆహారాన్ని దూరం పెడుతుండటంతో చిన్నారుల రోగ నిరోధక శక్తి తీవ్రంగా పడిపోతుంది. వాతావరణంలో వచ్చే చిన్నపాటి మార్పుల్ని తట్టుకోలేకపోతున్నారు.
Children's Health Story : జలుబు, జ్వరాలు పెరిగిపోతుండటంతో బడికిడుమ్మా కొట్టేస్తున్నారు. ఆటపాటలకు దూరం అవుతున్నారు. విటమిన్ల లోపం, వాతావరణ పరిస్థితుల వల్ల కేశ సమస్యలు, నేత్ర రుగ్మతలు ఆడపిల్లల్లో పదేళ్లలోనే రుతుస్రావ సమస్యలు, చర్మ వ్యాధులు అధికం అవుతున్నాయి. చిన్నచిన్నవిషయాలకే. కోపంతో ఊగిపోతుడం సహా చిన్నపాటి వైఫల్యానికే మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. కన్నవాళ్ల ప్రేమ పరిపూర్ణంగా దక్కకపోవడం, విపరీతమైన ఒత్తిడి, మాధ్యమాల ప్రభావం ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు.
పదీ పన్నెండేళ్ల లోపు పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు బీజంపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆడ పిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించిన నివేదిక ప్రకారం 2021లో 36 వేల 69 మైనర్లు అత్యాచారానికి గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయ. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సంఘటన పసిపిల్లల హృదయాలను కలిచివేసింది.