ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంజినీరింగ్, ఎంబీయే ఫీజులు ఖరారు..​ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు

Engineering Fees fixed: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పెంచిన ఫీజులు మూడు సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయని తెలిపింది. అత్యధికంగా రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. కనీస రుసుము రూ. 45 వేలుగా నిర్ణయించింది.

telangana latest news
తెలంగాణలోని కళాశాలల్లో ఫీజులు ఖరారు

By

Published : Oct 19, 2022, 7:05 PM IST

Engineering fees fixed by telangana: ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకు రాష్ట్రంలోని 159 కాలేజీల్లో ఫీజులను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీవో ప్రకారం కాలేజీల్లో కనీస రుసుం రూ.45వేలకు పెంచుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఫీజు రూ.లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్‌ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్‌, వాసవీ కాలేజీల్లో రూ.1.40లక్షలుగా నిర్ణయించారు. ఫీజుల పెంపు మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

అలాగే ఎంబీయే, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులు పెంచుతూ కూడా ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కనీస వార్షిక ఫీజు రూ.27వేలుగా సర్కారు ఖరారు చేసింది. ఎంటెక్ కనీస వార్షిక ఫీజు రూ.57 వేలుగా ఖరారు చేస్తూ జీవోలు ఇచ్చింది. అయితే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెంపుపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎల్లుండి నుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌ జరగనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details