ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Employees unions: సీపీఎస్​ రద్దుపై మాట తప్పితే.. ఎన్నికల్లో ప్రతిఘటన తప్పదు: ఉద్యోగ సంఘాలు - ఉద్యోగులు ఆందోళన

Employees unions protest: సీపీఎస్​ రద్దుపై ఉద్యోగ సంఘాలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. సీపీఎస్​ రద్దుపై సీఎం మాట తప్పారని ఉద్యోగ సంఘాల మండిపడ్డాయి. సీఎం ప్రాపకం కోసమే కోంత మంది ఉద్యోగ సంఘాల నేతలు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలని లేనిపక్షంలో వచ్చే ఎన్నికలలో ప్రతిఘటన తప్పదని ఉద్యోగులు హెచ్చరించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 8, 2023, 6:22 PM IST

Employees unions demand: సీపీఎస్​ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఏపీ సీపీఎస్​ ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే ముఖ్యమంత్రి జగన్, సీపీఎస్ రద్దుపై మాట తప్పారని ఏపీ సీపీఎస్​ ఉద్యోగ సంఘ నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రాపకం కోసం.. కొంత మంది ఉద్యోగ సంఘాల నేతలు తాపత్రయపడుతున్నారని, అందుకే వారుజీపీఎస్​కు మద్దతు తెలిపారని చెప్పారు. అసలు జీపీఎస్ విధివిధానాలు రాకుండానే.. అది బాగుందని వారు ఎలా చెబుతారని వారు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్​ను రద్దు చేసినప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రద్దు చేయడం ఎందుకు సాధ్యం కాదని, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ సీపీఎస్​ రద్దుపై ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలని లేనిపక్షంలో వచ్చే ఎన్నికలలో ఉద్యోగుల నుంచి ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

కర్నూలు జిల్లా: జీపీఎస్ విధానాన్ని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని సీపీఎస్ ఉద్యోగులు కర్నూలు జిల్లాలో ఆందోళన చేపట్టారు. సీపీఎస్​ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ హయాంలో సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి.. పెనం మీది నుంచి పోయిలో పడిన చందంగా తయారైందని సీపీఎస్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకుల మయలో పడ్డారని ఆరోపించారు. ఓపీఎస్ కు తప్ప ఏ విదానాన్ని ఒప్పుకోమని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. జీపీఎస్ విధానం ప్రభుత్వానిమేలు చేస్తుంది తప్పా... ఉద్యోగులకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. సీపీఎస్ రద్దు కై ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా: సీపీఎస్​ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. ఎన్నికలకు ముందు సీపీఎస్​ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్, అధికారం చేపట్టాక మాట తప్పి జీపీఎస్ ఇస్తామనడం అన్యాయమని ఏపీ సీపీఎస్ఈఏ నేతలు మండిపడ్డారు. నమ్మి ఓట్లేసిన ఉద్యోగులను ముఖ్యమంత్రి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎస్ ను నమ్మే పరిస్థితుల్లో ఉద్యోగులు లేరని, తమకు పాత ఫించన్ విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే తమ ఆశలు నెరవేరుతాయని భావించామని, కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించితేనే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జీపీఎస్, సీపీఎస్​ లను రద్దు చేయ్యాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


శ్రీకాకుళం జిల్లా: సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరణ చేయాలంటూ... శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేసారని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటున్నారు.

సీపీఎస్​ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details