Employees Letter To CS Jawahar Reddy On PRC Problems :పీఆర్సీ అరియర్లు, పీఆర్సీ బకాయిలతో పాటు పెన్షన్ నిధిలో ప్రభుత్వ వాటాను తక్షణమే చెల్లించాలని సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎస్ జవహర్ రెడ్డికి సచివాలయ సీపీఎస్ అసోసియేషన్ వినతి పత్రం అందించింది. ఉద్యోగులు తాము ఆమోదం తెలపకముందే ప్రభుత్వం ప్రతిపాదించిన ఊహాజనిత గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. సీపీఎస్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను రాష్ర్టం పాటించాలన్నారు.
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల డిమాండ్లపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. కొత్త పీఆర్సీ ఈ ఏడాది జులై నాటికే అమలులోకి రావాల్సి ఉండగా.. అందలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వరుస వినతి పత్రాలు పంపుతూనే ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడానికి తక్షణ చర్యలు చేపట్టమని సీఎంఓ ఆర్థిక శాఖను ఆదేశించింది.
సచివాలయంలోని 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్..
Employees Serious ON PRC Issue 2023 :ఉద్యోగుల మద్ధతు లేకుండా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌పై గుర్రుగా ఉన్న సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఎస్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీఅరియర్లు, పెన్షన్ నిధిల్లో ప్రభుత్వ వాటా చెల్లింపులు తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవటంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నామని సీపీఎస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2022 నుంచి నేషనల్ పెన్షన్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరిగ్గా చెల్లింపులు జరగక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సీపీఎస్‌లో కేంద్ర ప్రభుత్వం పెంచిన 14 శాతం ప్రభుత్వ వాటాను విడుదల చేయాలని డిమాండ్ చేసింది.