Eleventh Day of Anganwadis Strike : డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు పోరాడుతుంటే, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశం ద్వారా మాట్లాడినటువంటి అంశాలు అంగన్వాడీలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని శ్రీకాకుళంలో అంగన్వాడీలు తేల్చి చెప్పారు. శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వంతెనపై బైఠాయించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నా అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన జగన్ హామీలను గాలికొదిలేశారు: అంగన్వాడీలు
Demands of Anganwadis : కోనసీమ జిల్లా పి.గన్నవరంలో అంగన్వాడీలు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. అదేవిధంగా విశాఖలో అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు కనీస వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Minister Ushasri Charan Comments on Anganwadi Strike : ఎన్టీఆర్ జిల్లా మైలవరం, కృష్ణా జిల్లా మొవ్వలో అంగన్వాడీలు, C.I.T.U. నాయకులతో కలిసి రాస్తా రోకో నిర్వహించారు. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అంగన్వాడీల యూనిఫాం చీరలకు ప్రభుత్వం ఖర్చు చేశామని చెప్పటం విడ్డూరంగా ఉందని అంగన్వాడీలు మండిపడ్డారు. ఒంగోలు సీఐటీయూ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ సెంటర్లో రోడ్డుపై అంగన్వాడీలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు