Electricity Employees Chalo Vijayawada: 10న విద్యుత్ ఉద్యోగుల 'చలో విజయవాడ'.. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు ఆగవని హెచ్చరిక Electricity Employees Chalo Vijayawada on 10th of September: సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కేందుకు విద్యుత్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10న చలో విజయవాడ చేపట్టనున్న దృష్ట్యా సన్నాహక సమావేశం నిర్వహించారు. నిరసన తెలిపేందుకు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి సీఎం జగన్ కల్పించారంటూ విద్యుత్ ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ నేతలు మండిపడ్డారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఉద్రిక్తంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన.. 15 మంది అరెస్ట్
విజయవాడ దాసరి భవన్‌లో జరిగిన విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశంలో.. నాయకులు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం పోలీసుల సాయంతో తమపై నిర్భంధం ప్రయోగించాలని చూస్తే గ్రామస్థాయి నుంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని స్ట్రగుల్ కమిటీ నేతలు హెచ్చరించారు. ఇంక్రిమెంట్లు, అలవెన్సులు ఇవ్వడంలో పీఆర్సీ, డీఏలు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని ఉద్యోగులు మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
POWER EMPLOYEES PROTEST: డిమాండ్లు నెరవేర్చాలని.. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
ఒప్పంద, పొరుగుసేవల విభాగంలో పని చేస్తున్న కార్మికులకు కేవలం 15వేల నుంచి 20వేల మధ్యే ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోందని ఉద్యోగులు మండిపడ్డారు. ఎన్నికల ముందు క్రమబద్ధీకరణపై హామీ ఇచ్చిన జగన్.. ముఖ్యమంత్రి అయ్యాక.. గాలికొదిలేశారని దుయ్యబట్టారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు.
"ఎన్నికల ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. దీనిపై నిర్లక్ష్యం వహించారు. ఇంక్రిమెంట్లు, అలవెన్సులు ఇవ్వడంలో పీఆర్సీ, డీఏలు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. ఒప్పంద, పొరుగుసేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు కేవలం 15వేల నుంచి 20వేల మధ్యే ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తోంది. డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతాము." - సుబ్బిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, విద్యుత్ ఉద్యోగ సంఘాల స్ట్రగుల్ కమిటీ
"గత ప్రభుత్వంలో పెంచిన వేతనాలు తప్ప.. ఈ సర్కారు ఏ ఒక్క కార్మికుడికి అర్థరూపాయి కూడా పెంచలేదు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. విధి నిర్వహణలో భాగంగా ఏ కార్మికుడైనా చనిపోతే.. కారుణ్య నియామకాలు చేపట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క సౌకర్యం కూడా ఈ సర్కారులో లేదు. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను క్రమబద్ధీకరించే వరకూ పోరాటం కొనసాగుతుందని సీఎం జగన్కు, విద్యుత్ శాఖా మంత్రికి తెలియజేస్తున్నాము. ఈ నెల 10న చలో విజయవాడ చేపట్టనున్నాము." - బాలకాశీ, నాయకుడు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల ఫెడరేషన్
సోమవారం పెద్దఎత్తున విద్యుత్ ఉద్యోగుల ఆందోళన