ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వచ్చే ఏడాది "విద్యుత్ చార్జీల బాదుడే" బాదుడేనా..! - ప్రస్తుతం డిస్కంలకు రూ13 వేల కోట్ల ఆదాయ లోటు ఉండటం

Electricity Charges In The Next Financial very High: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల ముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం డిస్కంలకు 13 వేల కోట్ల రూపాయల ఆదాయ లోటు ఉండగా, ఆ మేరకు వినియోగదారులపై భారం మోపాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి అవసరమైన 76వేల 824 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోసం 52 వేల 690 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు.

డిస్కం
Discoms

By

Published : Dec 16, 2022, 3:06 PM IST

Electricity Charges In The Next Financial very High: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల ముప్పు ముంచుకొస్తోంది. వినియోగదారులపై ఫుల్ కాస్ట్ రికవరీ చార్జీల భారం మోపేందుకు డిస్కంలు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం డిస్కంలకు 13 వేల కోట్ల రూపాయల ఆదాయ లోటు ఉండగా, ఆ మేరకు వినియోగదారులపై భారం మోపాలని భావిస్తున్నాయి. ఎంతగా సర్దుబాటు చేసినా, కనీసం 6 వేల కోట్ల రూపాయల లోటు పూడ్చేందుకు ఛార్జీలు పెంచాల్సి వస్తుందని తెలుస్తోంది. ఏటా విడుదల చేసే వార్షిక నివేదికలో డిస్కంలు విద్యుత్ ఛార్జీల పెంపును ప్రతిపాదించలేదు.

ప్రస్తుతం అమలవుతున్న టారిఫ్‌ను యథావిధిగా అమలు చేస్తామని పేర్కొన్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి అవసరమైన 76వేల 824 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోసం 52 వేల 690 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్ ప్రకారం ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం 13 వేల 487 కోట్లుగా నమోదైంది. ఇందులో అధికంగా విద్యుత్ వాడుకునే పరిశ్రమలకు టైమ్ ఆఫ్ డే ఛార్జీలు వర్తింపజేయడం ద్వారా 697 కోట్ల అదనపు రాబడి వస్తుందని భావించినా ఇంకా 12 వేల 790 కోట్ల లోటు ఉంటుంది. దీన్ని ఎలా భర్తీ చేస్తాయనే విషయాన్ని డిస్కంలు ప్రస్తావించలేదు. ఇదే సమయంలో ఈ ఏడాది విద్యుత్ రాయితీ కింద ప్రభుత్వం ఎంత మొత్తాన్ని భరిస్తుందనే దానిపైనా స్ఫష్టత రాలేదు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details